Scorpio-N costly | వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను మరింతగా నియంత్రించడానికి అమల్లోకి తెచ్చిన రెండో దశ బీఎస్-6 ప్రమాణాలతో కార్ల ధరలు పెరుగుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా.. థార్ ధర పెంచిన తర్వాత తాజాగా ఫుల్ సైజ్ ఎస్యూవీ కారు స్కార్పియో-ఎన్ ధర పెంచేసింది. పాత ధరతో పోలిస్తే కొత్తగా స్కార్పియో-ఎన్ కొనుగోలు చేయాలంటే రూ.51,299 అధికంగా చెల్లించాలన్నమాట. నాలుగు నెలల్లో ఈ కారు ధర పెంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు జనవరిలో స్కార్పియో-ఎన్ ధర పెంచేసింది మహీంద్రా. తాజా ధర పెంపుతో స్కార్పియో-ఎన్ కారు ధర రూ.13.05 లక్షల నుంచి మొదలవుతుంది. వేరియంట్, ఫీచర్లను బట్టి గరిష్టంగా రూ. 24.51 లక్షలు పలుకుతుంది.
రెండోదశ బీఎస్-6 ప్రమాణాల అమలు కోసం కారులో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) పరికరం అమర్చాల్సి ఉంటుంది. కొత్త అప్డేట్ తర్వాత స్కార్పియో-ఎన్ పెట్రోల్ వేరియంట్ కారు ఇప్పుడు ఈ-20 పెట్రోల్తోనూ నడుస్తుంది. గతేడాది జూన్లో మహీంద్రా ఈ ఎస్యూవీ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పుడు స్కార్పియో-ఎన్ ధర రూ.11.99 లక్షల నుంచి మొదలైంది. అంటే మార్కెట్లోకి ఎంటరైన పది నెలల్లో స్కార్పియో-ఎన్ ధర దాదాపు రూ.లక్ష పెరిగిందన్నమాట.
మహీంద్రా స్కార్పియో-ఎన్ 2.0 లీటర్ల 4-సిలిండర్ ఎంస్టాలియన్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 197 బీహెచ్పీ విద్యుత్, 380 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. అదే సమయంలో డీజిల్ వేరియంట్ 2.2 లీటర్ల ఎంహాక్ ఇంజిన్తో వచ్చింది. డీజిల్ వేరియంట్ ఇంజిన్ 173 బీహెచ్పీ విద్యుత్, 400 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ కారు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ కలిగి ఉంటాయి. స్కార్పియో-ఎన్ టాప్ ఎండ్ వేరియంట్ ఫోర్వీల్ డ్రైవ్ ఆప్షన్లో లభిస్తుంది.
Scorpio-N | న్యూ రికార్డు.. నిమిషంలో 25వేలు.. అర్థగంటలో లక్ష .. స్కార్పియో-ఎన్ బుకింగ్స్
Mahindra Scorpio-N | మహీంద్రా పాపులర్ ఎస్యూవీ స్కార్పియో-ఎన్ కొనసాలంటే షాక్.. కారణం అదేనా?!