SBI Whatsapp Banking | వాట్సాప్ ద్వారా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు.. ఎలాగో తెలుసా?!
SBI Whatsapp Banking | వాట్సాప్ ద్వారా పలు సేవలు లభిస్తున్నాయి. ఎస్బీఐ కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తోంది.
SBI Whatsapp Banking | భారత్‌లో.. వివిధ దేశాల్లోనూ వాట్సాప్ యూజర్ల పునాది పెరుగుతోంది. ఈ జాబితాలోకి అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వచ్చి చేరింది. మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ఆధారంగా తన ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ కస్టమర్లు వాట్సాప్ ద్వారా మినీ స్టేట్మెంట్, ఖాతా బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇటీవల ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనలో `వాట్సాప్‌లో ఇప్పుడు మీ బ్యాంకు సేవలు. మీరు మీ ఖాతాలో బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు` అని తెలిపింది. అదెలాగో తెలుసుకుందామా..!
రిజిస్ట్రేషన్ ఇలా
ఎస్బీఐ ఖాతాదారు తొలుత తప్పనిసరిగా తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. WAREG అని రాసి స్పేస్ ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా నమోదు చేయాలి.. అటుపై 7208933148 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపాల్సి ఉంటుంది. అయితే మీ బ్యాంకు ఖాతాలో నమోదు చేసిన మొబైల్ నంబర్ నుంచే ఈ ఎస్సెమ్మెస్ పంఆలి
90226 90226 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ ఇలా
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ విజయవంతం అయిన తర్వాత ఎస్బీఐ 90226 90226 నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈ ఫోన్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి
ఇలా వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
90226 90226 నంబర్‌కు `Hi SBI` అని మెసేజ్ పంపాలి. లేదా వాట్సాప్ నుంచి మీకు వచ్చిన మెసేజ్‌కు రిప్లయ్ ఇవ్వాలి. అప్పుడు ఈ క్రింది మెసేజ్ వస్తుంది.
డియర్ కస్టమర్,
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం!
కింద ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొండి.
1. ఖాతా బ్యాలెన్స్
2. మినీ స్టేట్మెంట్
3. వాట్సాప్ బ్యాంకింగ్ నుంచి డీ-రిజిస్టర్
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల వాడకంపై మీ ఇష్టాయిష్టాలను బట్టి ఆప్షన్ ఎంచుకోవాలి. తన ఖాతాదారులకు వాట్సాప్ ఆధారిత సేవలు అందించడానికి ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతోపాటు ఎస్బీఐ జత కట్టింది.
ఎస్బీఐ కార్డ్ వాట్సాప్
తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు వాట్సాప్ ఆధారిత సేవలను ఇదే వాట్సాప్ ప్లాట్‌ఫామ్ కేంద్రంగా సేవలందించనున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల యూజర్లు తమ ఖాతా పూర్తి వివరాలు, రివార్డ్ పాయింట్లు, అన్‌పెయిడ్ బ్యాలెన్స్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, 9004022022 నంబర్‌కు OPTIN అనే మెసేజ్ పంపి యూజర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. సైన్అప్ అయ్యాక రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ ద్వారా 08080945040 ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ పంపడం గానీ, మొబైల్ యాప్ వాడకం ద్వారా గానీ సర్వీసులు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Banking services
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

