SBI | ఎస్బీఐ గుడ్ న్యూస్: ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ!
SBI | ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 50-100% మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది.
SBI | ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.. నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ)లు భారం అవుతున్నాయి. కొత్తగా ఇండ్ల రుణాలు తీసుకునే వారికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తీపి కబురందించింది. ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 50-100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ వచ్చేనెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది.
ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ఇండ్లు, ఇండ్ల సంబంధ రుణాలపై బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు 50 శాతం మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. ఇండ్ల రుణాలపై టాప్ అప్ అనుబంధ రుణాలపై బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా (100 శాతం) రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇతర అడ్వకేట్, వాల్యూయర్ ఫీజు-వాస్తవిక ఖర్చులు యధావిధిగా రుణ గ్రహీత నుంచి వసూలు చేస్తారు.
ఇంటి రుణంలో 0.35 శాతం బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, కనీసం రూ.2000 నుంచి గరిష్టంగా రూ.10వేలు ప్లస్ జీఎస్టీ వర్తింపజేస్తుంది ఎస్బీఐ. ఇంటి రుణం పొందడానికి ఇతర ఫీజులు, చార్జీలు వర్తిస్తాయి. లాగిన్ ఫీజు, టెక్నికల్ అసెస్మెంట్ ఫీజు, లీగల్ ఫీజు, ఫ్రాంకింగ్ ఫీజు, ప్రీ-ఈఎంఐ చార్జీ, రెగ్యులేటరీ చార్జీలు, రీ అప్రైజల్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం, నోటరీ ఫీజు, అడ్జుడికేషన్ ఫీజు తదితరాలు వర్తిస్తాయి.
ఎస్బీఐ ఇంటి రుణ వడ్డీరేట్లు ఇలా
ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 7.55 ప్లస్ సీఆర్పీ. రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 7.15 ప్లస్ సీఆర్పీ.. క్రెడిట్ స్కోర్ను బట్టి రిస్క్ ప్రీమియం ఖరారు చేస్తారు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 0.10 శాతం పెంచేసింది. పెంచిన వడ్డీరేట్లు జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- home loans
- processing fee
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

