SBI vs Post Office RD | బెటర్ రిటర్న్స్.. ఎస్బీఐ vs పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్.. ఏది బెస్ట్?!
SBI vs Post Office RD | పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ లేదా ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకాల్లో ఏది బెస్ట్.. ఏ పథకంలో ఇన్వెస్ట్ చేసినా.. దానిపై వచ్చే వడ్డీ ఆదాయం, పన్ను మినహాయింపులు పరిశీలించుకున్నాకే పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
SBI vs Post Office RD | వేతన జీవి మొదలు చిన్న వ్యాపారులు.. గృహిణులు తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేయాలని భావిస్తారు. అలా పొదుపు చేసిన పథకాల్లో రిస్క్ లేని బెటర్ రిటర్న్స్ పథకాల వైపే మొగ్గుతుంటారు. వాటిల్లో రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆయా డిపాజిట్ పథకాల్లో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, బ్యాంకులు.. ప్రత్యేకించి ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులపై ఎంత రాబడి ఉంటుంది. ఆదాయం పన్ను మినహాయింపు ఎంత వరకు లభిస్తుందన్న సంగతి చెక్ చేసుకున్నాక మన డబ్బు బెటర్ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.
ప్రస్తుతం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌పైనే ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తున్నది. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్తోపాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఈ నెల ఒకటో తేదీనే వడ్డీరేటు 5.8 నుంచి 6.2 శాతం వరకు వడ్డీ పెంచింది. గత ఫిబ్రవరిలో రికరింగ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది. ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఇప్పుడు పోస్టాఫీసు లేదా ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ల్లో ఏది బెస్ట్ అన్నది పరిశీలిద్దాం.. !
రికరింగ్ డిపాజిట్ అంటే.. ఇది పెద్ద మొత్తంలో పొదుపు చేయడానికి ఉపకరించే పథకం. దీన్ని పిగ్గీ బ్యాంక్‌గా కూడా వాడొచ్చు. ప్రతి నెలా మీ వేతనం రాగానే నిర్ధిష్ట మొత్తం రికరింగ్ డిపాజిట్లో జమ చేయాలి. మెచ్యూరిటీ తేదీ నాటికి భారీ మొత్తం మీ చేతికి అందుతుంది.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో విశేషాంశాలు..
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లో ఏడాది నుంచి 10 ఏండ్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్‌పై గరిష్టంగా ఏడు శాతం.. సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీ పొందొచ్చు.
ప్రతి నెలా కనీసం రూ.100 పొదుపు చేయొచ్చు. పొదుపునకు గరిష్ట పరిమితి లేదు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో ప్రత్యేకతలు
ఇండియా పోస్ట్ రికరింగ్ డిపాజిట్‌పై 6.2 శాతం వడ్డీ లభిస్తుంది.
ప్రతి నెలా రూ.100 కనీసం పెట్టుబడి పెట్టాలి.. గరిష్ట పెట్టుబడికి పరిమితుల్లేవు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో ఐదేండ్లు ప్రతి నెలా రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే ఐదేండ్ల తర్వాత లభించే రిటర్న్స్ రూ.70,431.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీంలో ప్రతి నెలా రూ.1000 చొప్పున ఐదేండ్లు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత వచ్చే ఆదాయం రూ.70,989. మనం పొదుపు చేసే మొత్తాన్ని బట్టి రిటర్న్స్ పెరుగుతాయి.
రికరింగ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయం రూ.40 వేలు, సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు ఆదాయం పన్ను రాయితీ ఉంది. ఇంతకు మించి వడ్డీ ఆదాయం వస్తే 10 శాతం టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటారు.
రికరింగ్ డిపాజిట్లపై వార్షిక ఆదాయం రూ.40 వేలు (సీనియర్ సిటిజన్లకు రూ.50వేల)కు పైగా వచ్చినా.. మొత్తం వార్షిక ఆదాయం బ్యాంక్ పరిమితి కంటే తక్కువ ఉంటే టీడీఎస్ డిడక్ట్ చేయరు.
టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఆదాయం పన్ను చట్టంలోని 15హెచ్ ఫామ్, ఇతరులు 15జీ ఫామ్ సంబంధిత బ్యాంకులో సమర్పించాలి.
ఫామ్ 15హెచ్ లేదా ఫామ్ 15జీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. మీ ఆదాయం పన్ను శ్లాబ్ కంటే తక్కువే అని ఈ డిక్లరేషన్ ఫామ్ తెలుపుతుంది. ఐటీ రిటర్న్స్ ఫామ్స్‌లోనూ ఈ అంశాలు వెల్లడించాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

