SBI Amrut Kalash | అమృత్ కలశ్ పునరుద్ధరించిన ఎస్బీఐ.. జూన్ వరకు గడువు!
SBI Amrut Kalash | ఎస్బీఐ తన స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీం `అమృత్ కలశ్` ఫథకాన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.
SBI Amrut Kalash | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు..భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన లిమిటెడ్ ఆఫర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం.. ‘అమృత్ కలశ్ డిపాజిట్’ను పునరుద్ధరించింది. 400 రోజుల గడువుతో ఈ స్కీం అందుబాటులో ఉంటది. గత నెలాఖరుతోనే ఈ స్కీం గడువు ముగిసినా మళ్లీ పునరుద్ధరించింది. వచ్చే జూన్ నెలాఖరు వరకు ఈ స్కీం అందుబాటులో ఉంటుంది.
ఈ పథకంలో నగదు డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తున్నది. ఈ నెల 12 నుంచి పునరుద్ధరించిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం.. జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. ఈ పథకం కింద డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టం కింద టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. బ్యాంకు బ్రాంచ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరవచ్చు.
ఖాతాదారులు గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. స్వల్పకాలిక లక్ష్యంతో డిపాజిట్ చేసే వారికి ఈ అమృత్ కలశ్ పథకంతో ప్రయోజనాలు ఉన్నాయి. మెచ్యూరిటీకి ముందే నగదు విత్ డ్రా చేసుకోవడంతోపాటు లోన్ సౌకర్యం కూడా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

