SBI pre-Approver Loan | టూ వీలర్స్‌కు ఎస్బీఐ ప్రీ-అప్రూవ్డ్ లోన్.. బట్ వయా యోనో యాప్
SBI pre-Approver Loan | ఎస్బీఐ ఖాతాదారుల కోసం యోనో యాప్ ద్వారా టీ వీలర్స్ కొనుగోలుకు ప్రీఅప్రూవ్డ్ లోన్ అందుబాటులోకి తెచ్చింది.

SBI pre-Approver Loan | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. టూ వీలర్స్ కొనుగోలుదారుల కోసం ఈజీ రైడ్ పేరిట ప్రీ-అప్రూవ్డ్ టూవీలర్స్ స్కీమ్ ప్రారంభించింది. అయితే, కస్టమర్లు ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు రూ.3 లక్షల వరకు టూ వీలర్స్ ప్రీ అప్రూవ్డ్ రుణాలు ఆఫర్ చేస్తున్నది. ఇప్పటికే యోనో యాప్ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లోగానీ ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీరేట్లపై అదనంగా ఐదు బేసిక్ పాయింట్లు డిస్కౌంట్ కల్పించింది.
కనీసం రూ.20 వేల నుంచి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు టూ వీలర్స్ ప్రీ అప్రూవ్డ్ రుణం ఎస్బీఐ అందిస్తుంది. ఏటా 10.5 శాతం వడ్డీరేటుపై నాలుగేండ్ల టెన్యూర్‌తో ఈ రుణం మంజూరవుతుంది. బ్యాంకు శాఖను సంప్రదించకుండా నేరుగా యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న కస్టమర్లందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని ఎస్బీఐ వివరించింది.
ప్రీ అప్రూవ్డ్ కస్టమర్ సదరు వాహనం ధరలో 85 శాతం వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేండ్ల గడువులోగా రుణం చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణంపై లక్షకు రూ.2,560 నెలవారీ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన రుణం సంబంధిత వెహికల్ డీలర్ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- sbi
- two wheelers
- yono app
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

