SBI Diwali Gift | ఎస్బీఐ దీపావళి గిఫ్ట్.. సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పెంపు.. ఇవీ డిటైల్స్
SBI Diwali Gift | సీనియర్ సిటిజన్ల సెలెక్టెడ్ టెన్యూర్ల ఎఫ్డీలపై 80 బీపీఎస్ వడ్డీ పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
SBI Diwali Gift | సీనియర్ సిటిజన్లకు భారతీయ స్టేట్బ్యాంక్ (ఎస్బీఐ) తీపి కబురందించింది. సీనియర్ సిటిజన్లు జమ చేసే రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేసింది. సెలెక్టెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్లపై 80బేసిక్ పాయింట్లు వడ్డీ పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తాన్ని బట్టి 25 బేసిక్ పాయింట్ల నుంచి 80 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీరేట్లు పెరుగుతాయి. ఇంతకుముందు ఈ నెల 15న రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 బేసిక్ పాయింట్ల వడ్డీ పెంచింది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు వారంలో రెండుసార్లు పెంచినట్లయింది. 211 రోజుల నుంచి ఏడాది లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 90 బేసిక్ పాయింట్లు పెరిగినట్లయింది.
ధరలను కట్టడి చేయడానికి గత మే నుంచి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పెంచుతున్న రెపోరేట్కు అనుగుణంగా ఎస్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచుతున్నది. తాజా పెంపుతో సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో ఒక శాతం వడ్డీ లభిస్తుంది. వివిధ టెన్యూర్లలో ఇతర సీనియర్ సిటిజన్ల కంటే అదనంగా ఎస్బీఐ పెన్షనర్లు 0.5 శాతం వడ్డీ పొందొచ్చు.
ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు సీనియర్ సిటిజన్ల రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.65% నుంచి 6.9 శాతానికి వడ్డీరేటు పెరిగింది. మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 30 బేసిక్ పాయింట్లు పెరిగి 6.30% నుంచి 6.60% శాతానికి చేరుకున్నది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 బేసిక్ పాయింట్లు పెరిగి 6.15% నుంచి 6.75% శాతానికి పెరుగుతుంది.
46 నుంచి 179 రోజుల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 4.50% నుంచి ఐదు శాతానికి చేరుకుంది. ఇక 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.15% నుంచి 5.75% వద్ద స్థిర పడింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ స్టాఫ్, ఎస్బీఐ పెన్షనర్లకు అదనంగా ఒకశాతం వడ్డీ లభిస్తుంది. 60 ఏండ్లు, 60 ఏండ్లు దాటిన ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు.. ఇతర సీనియర్ సిటిజన్ల కంటే అదనంగా 0.50 శాతం వడ్డీ పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

