SBI Cashback Card | `క్యాష్‌బ్యాక్` ఆఫర్ల బాటలో ఎస్బీఐ కార్డ్.. కొత్తగా..!
SBI Cashback Card | మార్కెట్ వాటా పెంపుకోసం ఎస్బీఐ కార్డ్.. క్యాష్‌బ్యాక్ కార్డు తెచ్చింది. ఆన్లైన్ పేమెంట్స్‌పై 5% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.
SBI Cashback Card | క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇప్పుడు క్రేజీగా మారాయి. ఈ ఆఫర్ల బాటలో ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ `ఎస్బీఐ కార్డ్` కూడా చేరింది. క్రెడిట్ కార్డుల మార్కెట్లో తమ వాటా పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఆన్లైన్లో క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిపే వారికి ఆకర్షణీయ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం కొత్త క్రెడిట్ కార్డు ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డు అనే పేరుతో ఈ క్రెడిట్ కార్డు తీసుకు వచ్చింది. అన్ని రకాల ఆన్లైన్ లావాదేవీలాపైనా ఐదు శాతం క్యాష్ బ్యాక్ కల్పిస్తున్నది. ఆఫ్‌లైన్ పేమెంట్స్‌పై ఒకశాతం క్యాష్‌బ్యాక్ చేస్తున్న ఎస్బీఐ కార్డ్.. ఆన్లైన్ మర్చంట్‌తో అపరిమితంగా లావాదేవీలు జరిపేందుకు అనుమతిస్తున్నది.
బిల్లింగ్ స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత రెండు రోజులకు ఎస్బీఐ కార్డు అకౌంట్లో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఆన్లైన్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ అపరిమితంగా ఉంటుంది. బిల్లింగ్‌పై మాత్రం అత్యధికంగా రూ.10 వేల వరకు అనుమతి ఇస్తుంది. ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లు, కరంట్, వాటర్, ఫోన్ తదితర యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై మాత్రం ఒకశాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
క్యాష్ బ్యాక్ ఎస్బీఐ కార్డుతో క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియోలో తమ వాటా పెరుగుతుందని ఎస్బీఐ కార్డ్ ఎండీ కం సీఈవో రామ్మోహనరావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా పలు స్పెషలాఫర్లు ఉన్నాయి. తొలి ఏడాది ఉచితంగానే ఈ క్రెడిట్ కార్డు జారీ చేస్తామన్నారు. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు కావాలనుకునే వారు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ స్ప్రింట్ వెబ్సైట్లోకి వెళ్లి డిజిటల్ అప్లికేషన్ పూర్తి చేస్తే సరి.. మీ ఇంటికే క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది.
స్పెషల్ ఆఫర్ కింద వచ్చే మార్చి వరకు ఈ క్రెడిట్ కార్డు ఉచితంగా అందిస్తుంది ఎస్బీఐ కార్డ్. అటుపై ఏడాదికి రూ.999 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ.2 లక్షలకు పైగా లావాదేవీలు జరిపితే వార్షిక ఫీజు మాఫీ అవుతుంది. పెట్రోల్ పంపుల వద్ద ఒకశాతం ఫ్యూయల్ చార్జీ రాయితీ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Cash Back
- sbi card
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

