సెబీకి షాక్.. పీఎన్బీ హౌసింగ్‌కు నిధుల సేకరణకు ఓకే.. కానీ..!!
సెబీకి షాక్.. పీఎన్బీ హౌసింగ్‌కు నిధుల సేకరణకు ఓకే.. కానీ..!! | కార్లైల్ సంస్థకు వాటాల విక్రయం ద్వారా నిధులు సేకరించాలన్న పంజాబ్ నేషనల్ ....

ముంబై: కార్లైల్ సంస్థకు వాటాల విక్రయం ద్వారా నిధులు సేకరించాలన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయంపై సెబీకి షాక్ తగిలింది. కార్లైల్ సంస్థకు వాటాలను విక్రయించి రూ.4000 కోట్ల నిధులు చేపట్టాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయించింది. మంగళవారం జరిగే ప్రత్యేక వార్షిక సమావేశం (ఈజీఎం)లో దీనికి ఆమోదం తెలుపాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ భావించింది.
ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే వరకు ముందుకు వెళ్లొద్దని ఇంతకుముందు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను సెబీ ఆదేశించింది. సెబీ ఆదేశాలకు వ్యతిరేకంగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారం సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో అప్పీల్ చేసింది.
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన శాట్.. మంగళవారం పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. అయితే, ఈజీఎం తీర్మానాలను ఎన్ఎస్డీఎల్కు తెలియజేయాలని సూచించింది.
తదుపరి ఆదేశాలిచ్చే వరకు తీర్మానాలను బహిర్గతం చేయొద్దని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీన జరుగనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- pnb housing finance
- sebi
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

