Samsung Galaxy M55 5G | శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం55 5జీ ఆవిష్కరణ.. ధరెంతంటే..?!
amsung Galaxy M55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ సోమవారం తన ఎం సిరీస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Samsung Galaxy M55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ (Samsung) సోమవారం తన ఎం సిరీస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీంతోపాటు శాంసంగ్ ఎం15 5జీ (Samsung Galaxy M 15 5G) ఫోన్ కూడా ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లను ఇంతకుముందే గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ పెట్టింది. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్ ఒక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ (Octa core Qualcomm Snapdragon) ప్రాసెసర్ తో వస్తున్నది. మూడు ర్యామ్ + స్టోరేజీ వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తున్నది. వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు, ట్రిపుల్ రేర్ కెమెరా కూడా ఉంటది.
శాంసంగ్ గెలాక్సీ ఎం 55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌ల్లో ఫోన్లు బుక్ చేసుకోవచ్చు. డెనిమ్ బ్లాక్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ బేస్డ్ వన్ యూఐ 6.1 వర్షన్ పై పని చేస్తుంది. నాలుగేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 5జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ వైడ్ యాంగిల్ లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్పెషిఫికేషన్స్ ఇలా
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ (Samsung Galaxy M15 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,299, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,799లకు లభిస్తాయి. గత నెల 11న భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ఆవిష్కరించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.50 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే విత్ (2340×1080 పిక్సెల్) రిజొల్యూషన్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేతో వస్తుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

