Effect of Work from Office | కొవిడ్-19 మహమ్మారి వేళ వివిధ రంగాలు.. సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది వర్క్ ఫ్రం హోం సేవలందించారు. గత రెండేండ్లలో అత్యధిక టైం ఇండ్లలోనే గడిపారు. వర్క్ ఫ్రం హోం టైంలో ఫార్మల్ డ్రస్‌లు, బూట్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు తగ్గాయి. ఇప్పుడు మార్కెట్, ఆఫీసులు పూర్తిగా తెరుచుకోవడంతో ఫార్మల్ దుస్తులు, బూట్లు, బ్యాగ్‌లు, వాచీల కొనుగోళ్లు పెరిగాయి. గత కొన్ని నెలలుగా ఫార్మల్ దుస్తులు, కాస్మొటిక్స్, జ్యువెల్లరీ, ఫుట్‌వేర్ కొనుగోళ్లు నిరంతరాయంగా పెరిగిపోయాయి.
జూలైలో ఫార్మల్ దుస్తుల కొనుళ్లు, పాదరక్షల కొనుగోళ్లు పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటా తెలిపింది. గతేడాదితో పోలిస్తే గత నెలలో 48 శాతం పెరిగాయి. ఆన్లైన్లో మైంత్రా, మీషో వంటి సంస్థల్లో అపారెల్, కాస్మొటిక్స్ కొనుగోళ్లు ఐదు రెట్లు ఎక్కువయ్యాయి. ఆదిత్య బిర్లా రిటైల్‌లో 55 శాతం గ్రోత్ పెరిగింది.
ఇక రేమండ్స్, బాటా ఇండియా వంటి సంస్థల్లో దుస్తులు, పాదరక్షల విక్రయాలు.. కరోనా ముందు స్థాయిని దాటేశాయి. ఆగస్టులో షర్టులు, ట్రౌజర్, బ్లేజర్, కుర్తీల కొనుగోళ్లు 125 శాతం పెరిగాయని మీషో సీఎక్స్‌వో ఉత్తమ కుమార్ చెప్పారు. లిప్‌స్టిక్‌లు, ఐలైనర్, సన్‌స్క్రీన్, బేర్డ్ ఆయిల్ కొనుగోళ్లలో 165 శాతం గ్రోత్ నమోదైంది.