New Labour Code | న్యూ లేబర్‌కోడ్‌లతో వేతనం To తుది సెటిల్మెంట్ ఇలా!
New Labour Code | నూతన లేబర్‌కోడ్‌లతో ఉద్యోగి వేతనం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఫైనల్ సెటిల్మెంట్ రూల్స్ మారనున్నాయి.
New Labour Code | పాత కార్మిక చట్టాల స్థానే తీసుకొచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్లను త్వరలో కేంద్రం అమలు చేయనున్నది. వివిధ సంస్థలు, కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల జీవితాలు మెరుగు పర్చడమే ఈ లేబర్ కోడ్ల అసలు లక్ష్యం. వీటి అమలుతో ఉద్యోగి, యాజమాన్యం మధ్య సంబంధ బాంధవ్యాలకు సంబంధించి నిబంధనలు పూర్తిగా మారిపోతాయి. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ప్రకారం ఉద్యోగుల వేతనాలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, వార్షిక సెలవులు, కంపెనీ నుంచి వైదొలిగితే ఉద్యోగికి ఫైనల్ సెటిల్మెంట్ తదితర అంశాల్లో మార్పులొస్తాయి.
ఉద్యోగి వేతనంలో ఇలా మార్పులు
లేబర్ కోడ్ అమల్లోకి రావడంలో వేతనాలకు నూతన నిర్వచనం రానున్నది. ఇంటికి తీసుకెళ్లే వేతనం, పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై ప్రభావం పడుతుంది. వేతనాల్లో యూనిఫార్మిటీ రానున్నది. దీనివల్ల బోనస్, గ్రాట్యూటీ, పీఎఫ్‌లో కంట్రిబ్యూషన్, ఈఎస్ఐలో వాటా తదితర అంశాలపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగి మొత్తం స్థూల వేతనంలో 50 శాతం కనీస వేతనంగా మారుతుంది. ఉద్యోగి, యాజమాన్యం పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లే వేతనం తగ్గుతుంది. నూతన చట్టం ప్రకారం రిటైర్మెంట్ తర్వాత తీసుకునే సొమ్ము, గ్రాట్యూటీ పెరుగుతాయి.
ప్రతియేటా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
వేతనం, చెల్లింపులతోపాటు ఉద్యోగుల లీవ్ పాలసీని హేతుబద్ధీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతియేటా ఉద్యోగి తాను వాడుకోని సెలవులు ఎన్‌క్యాష్ చేసుకునేలా అనుమతించింది. ప్రస్తుతం సంస్థ నుంచి వైదొలుగుతున్నప్పుడు మాత్రమే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేస్తున్నారు. కానీ లేబర్ కోడ్ ప్రకారం ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపు దశలో వాడుకోని సెలవులను ఎన్‌క్యాష్ చేసుకునే వెసులుబాటు ఉద్యోగులకు కల్పిస్తున్నారు.
నూతన లేబర్ లా ప్రకారం వేతన ఫైనల్ సెటిల్మెంట్
రాజీనామా చేసిన, ఉద్వాసనకు గురైన ఉద్యోగుల, కార్మికుల వేతన ఫైనల్ సెటిల్మెంట్ రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఫైనల్ సెటిల్మెంట్.. నెల లేదా రెండు నెలల సమయం పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

