Rupee Falls: మరీ క్షీణించిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే 82.33 వద్ద ట్రేడింగ్
Rupee falls:అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee falls) ఇవాళ మరిత పతనమైంది. ఉదయం 82.33 వద్ద స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయ్యింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూపాయి విలువ 16 పై
ముంబై: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee falls) ఇవాళ మరిత పతనమైంది. ఉదయం 82.33 వద్ద స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయ్యింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూపాయి విలువ 16 పైసలు డౌన్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, స్వదేశీ మార్కెట్లో నెగటివ్ ట్రెండ్ వల్ల రూపాయి విలువ మరింతగా దిగజారిపోయింది. డాలర్‌తో పోలిస్తే జీవితకాలంలో అత్యంత కనిష్టానికి పడిపోయింది.
ఇవాళ ఉదయం 82.19 వద్ద రూపాయి ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత ఓ దశలో 82.33 కు ట్రేడింగ్ చేరుకున్నది. దీంతో గత రాత్రితో పోలిస్తే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 16 పైసలు తగ్గినట్లు విశ్లేషకులు వెల్లడించారు. గురువారం తొలిసారి ట్రేడింగ్‌లో 82 కన్నా తక్కువగా క్లోజ్ అయ్యింది.
గురువారం ఒక్కసారిగా రూపాయి విలువ కుప్పకూలింది. చరిత్రలో తొలిసారిగా 82 మార్క్ దిగువకు పడిపోయింది. 55 పైసలు నష్టపోయి 82.17 వద్ద ముగిసింది. ఫారెక్స్మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలో 81.52 స్థాయి వద్ద రూపాయి సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలపడటంతో స్థానిక కరెన్సీ క్రమేపీ క్షీణించింది. గత ట్రేడింగ్ రోజైన మంగళవారం రూపాయి 20 పైసలు పెరిగి 81.62 వద్ద ముగిసింది.
చమురు ఎగుమతి దేశాల మండలి ఒపెక్ ఉత్పత్తిలో కోత విధించడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారల్‌కు 93.80 డాలర్లకు పెరిగిందని, దీంతో రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనయినట్టు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. అమెరికాలో సర్వీసుల పీఎంఐ, ప్రైవేట్ పేరోల్స్కు సంబంధించి సానుకూల గణాంకాలు వెలువడటంతో డాలర్ బలపడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫారెక్స్ నిపుణుడు గౌరాంత్ సోమయ్య చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

