ఆల్‌టైమ్ కనిష్ఠానికి రుపీ
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే 17 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 83.61 వద్ద నిలిచింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 83.48 రికార్డు కనుమరుగైపోయింది. గత నెల మార్చి 22న ఈ కనిష్ఠ రికార్డు నమోదైన విషయం తెలిసిందే.
- ఒక్కరోజే 17 పైసలు పతనం
- మొదటిసారి 83.61 స్థాయికి క్షీణత
ముంబై, ఏప్రిల్ 16: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే 17 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 83.61 వద్ద నిలిచింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 83.48 రికార్డు కనుమరుగైపోయింది. గత నెల మార్చి 22న ఈ కనిష్ఠ రికార్డు నమోదైన విషయం తెలిసిందే. కాగా, స్టాక్ మార్కెట్ల నష్టాలు, డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలోనే రుపీ ఈ స్థాయిలో పతనమైందని ఫారెక్స్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఉదయం ఆరంభం నుంచే రుపీ నష్టాల్లో ట్రేడైంది. సోమవారం 83.44 వద్ద ముగిసినా.. మంగళవారం 83.51 వద్ద మొదలైంది.
ఇలాగైతే కష్టమే..
రూపాయి విలువ ఇలాగే పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులు, సేవలు ఖరీదెక్కుతాయని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీయగలదంటున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే వడ్డీరేట్లను హైలోనే ఉంచుతున్న ఆర్బీఐ.. మరికొంత కాలం కోతల జోలికి పోదని, అప్పుడు రుణ భారం పెరిగి అన్ని రంగాలు కుదేలవుతాయన్న అంచనాలున్నాయి.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. సెన్సెక్స్ 456.10 పాయింట్లు నష్టపోయి 72,943.68 వద్దకు జారుకున్నది. నిఫ్టీ 124.60 పాయింట్లు కోల్పోయి 22,147.90 వద్దకు పడి పోయింది. ఇక గత మూడు సెషన్లలో రూ.8 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. కాగా, శ్రీ రామనవమి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచనున్నారు. తిరిగి గురువారం స్టాక్ ఎక్సేంజ్‌లు తెరుచుకోనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

