Royal Enfield | తెలంగాణలో దూసుకెళ్తున్న బుల్లెట్టు బండి!
Royal Enfield | ప్రీమియం మోటార్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్.. బుల్లెట్.. యెజ్డీపై ప్రయాణం థ్రిల్లే వేరు.. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్స్ ఇప్పుడు ...

Royal Enfield | ప్రీమియం మోటార్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్.. బుల్లెట్.. యెజ్డీపై ప్రయాణం థ్రిల్లే వేరు.. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్స్ ఇప్పుడు తెలంగాణలో శరవేగంగా దూసుకెళ్తున్నాయి. ఎన్ఫీల్డ్కు దేశంలోని కీలక మార్కెట్లలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మాత్రమే కాదు.. యావత్ తెలంగాణ అంతటా ఎన్ఫీల్డ్కు గిరాకీ పెరుగుతుంది. గత రెండేండ్లలో తెలంగాణలో రెండున్నర రెట్లు గ్రోత్ నమోదు చేసింది రాయల్ ఎన్ఫీల్డ్.
గిరాకీని మరింత పెంచుకునేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తన పెట్టుబడులు పెంచేస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు వందకి పైగా స్టోర్లు, 80కి పైగా స్టూడియో స్టోర్స్ ఉన్నాయి. 150 సీసీ ప్లస్ బైక్స్ విక్రయాలు రాష్ట్రంలో 17 శాతం పైమాటే. క్లాసిక్ బైక్స్ సేల్స్ 72 శాతం.
ఖమ్మం.. వరంగల్ల్లో ఎన్ఫీల్డ్కు ఫుల్ గిరాకీ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోనూ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్స్‌కు మంచి డిమాండ్ ఉందని సంస్థ నేషనల్ బిజినెస్ హెడ్ (సౌత్ అండ్ ఈస్ట్) జయప్రదీప్ వాసుదేవన్ చెప్పారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మార్కెట్ పెరుగుతుందన్నారు. కొత్తగా రాష్ట్రంలో 10-12 ఔట్లెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఔట్లెట్లను డీలర్లు నడుపుతారని చెప్పారు. ఈ ప్రాంత బైక్స్ సర్వీసింగ్ కోసం తాము 60కి పైగా సర్వీస్ ఆన్ వీల్స్ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ మెరుగు పరిచేందుకు తమ యాప్‌లో పలు ఫీచర్లు జత చేశామన్నారు జయప్రదీప్ వాసుదేవన్. ఎలక్ట్రిక్, గ్రీన్ మొబిలిటీ వెహికల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు. సంబంధిత టీమ్స్ ఆ దిశగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
భాగ్యనగర మార్కెట్లోకి ఎన్ఫీల్డ్ ఆల్ న్యూ క్లాసిక్ 350
మోడ్రన్ అండ్ రిఫైన్డ్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌తో రూపుదిద్దుకున్న ఆల్ న్యూ క్లాసిక్-350 ఎన్ఫీల్డ్ బైక్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేశారు. 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్పీ, 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం పవర్ జనరేషన్ సామర్థ్యం గల 349 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్, ఎయిర్/ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్నది న్యూ క్లాసిక్ 350.
ఐదు వేరియంట్లలో లభ్యం
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ బైక్ 11 రంగుల్లో ఐదు వేరియంట్లలో లభ్యం అవుతుంది. రెడిచ్ సిరీస్, హాల్క్యోన్ సిరీస్, క్లాసిక్ సిగ్నల్, డార్క్ సిరీస్, క్లాసిక్ క్రోమ్ వేరియంట్లలో క్లాసిక్ 350 బైక్ అందుబాటులో ఉంది.
ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధరవరలు ఇలా..
హైదరాబాద్‌లో రెడిచ్ క్లాసిక్ న్యూ క్లాసిక్ 350 బైక్ ధర రూ.1,84,374 నుంచి మొదలవుతుంది. హాల్క్యోన్ సిరీస్ వేరియంట్ బైక్ రూ. 1,93,123లకు, క్లాసిక్ సిగ్నల్స్ రూ. 2,04,367లకు కొనుగోలు చేయొచ్చు. ఇంకా డార్క్ సిరీస్ బైక్ రూ.2,11,465 ధర పలుకుతుంది. క్లాసిక్ క్రోమ్ రూ.2,15,118లకు లభ్యం అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Royal Enfield
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

