Revolt RV400 BRZ | మార్కెట్లోకి రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జడ్ ఈవీ.. ధరెంతంటే..?!
Revolt RV400 BRZ | విద్యుత్ వాహనాల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) భారత్ మార్కెట్లోకి న్యూ రివోల్ట్ ఆర్వీ 400 బీఆర్జడ్ మోటారు సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.38 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.
Revolt RV400 BRZ | విద్యుత్ వాహనాల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) భారత్ మార్కెట్లోకి న్యూ రివోల్ట్ ఆర్వీ 400 బీఆర్జడ్ (Revolt RV400 BRZ) మోటారు సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.38 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. కంపెనీ వెబ్సైట్, డీలర్ షిప్‌ల వద్ద ఈవీ రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జడ్ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జడ్ బైక్ 72వాట్ల, 3.24 కిలోవాట్ల లిథియం ఆయాన్ బ్యాటరీతో వస్తుంది. ఎకో మోడ్‌లో 150 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. నార్మల్ మోడ్‌లో 100 కి.మీ, స్పోర్ట్ మోడ్‌లో 80 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. స్పోర్ట్ మోడ్ గరిష్టంగా గంటకు 80 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జడ్ బ్యాటరీ 70 శాతం చార్జింగ్ కోసం మూడు గంటలు, పూర్తిగా రీచార్జి కావడానికి 4.5 గంటల సమయం పడుతుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. చార్జింగ్ తగ్గుతున్నప్పుడు ఎనర్జీ పెంపొందించడానికి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉపకరిస్తుంది.
రివోల్ట్ ఆర్వీ 400 బీఆర్జడ్ మోటారు సైకిల్ ఐదు స్ట్రైకింగ్ కలర్ ఆప్షన్లు – పసిఫిక్ బ్లూ, కాస్మిక్ బ్లాక్, డార్క్ సిల్వర్, రెబెల్ రెడ్, లునార్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోసాక్ రేర్ సస్పెన్షన్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, స్పీడ్, బ్యాటరీ లెవెల్, రైడింగ్ మోడ్, టెంపరేచర్ వివరాలు తెలిపే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇష్టమైన శబ్ధం (సౌండ్) ఎంపిక చేసుకునేందుకు మై రివోల్ట్ అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

