Retail Inflation | ఏడాది కనిష్ట స్థాయికి డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం.. కానీ.. !
Retail Inflation | డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయి 5.72 శాతంగా నమోదైంది.
Retail Inflation | ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. గత నెల చిల్లర ద్రవ్యోల్బణం 5.72 శాతంగా నమోదైంది. ఆర్బీఐ నియంత్రణ స్థాయి 4 (+/-2_ ) కంటే రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం వరుసగా రెండో నెల. భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) బాస్కెట్లో 46 శాతంగా ఉన్న ఆహారం, శీతల పానీయాల ధరలు పతనం కావడంతో చిల్లర ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. గత అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతం కాగా, నవంబర్‌లో 5.88 శాతానికి దిగొచ్చింది. నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ట స్థాయి. అయితే డిసెంబర్ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.05 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.39 శాతంగా నమోదైంది.
ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్లో 4.19 శాతం అయితే, నవంబర్‌లో 4.67 శాతంగా నమోదైంది. సీపీఐలో ఆహార ద్రవ్యోల్బనం వాటా దాదాపు 40 శాతం. కూరగాయల ధరలు -15.08 శాతం కాగా, తృణ ధాన్యాలు, ఇతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 13.79 శాతంగా నమోదైంది. సుగంధ ద్రవ్యాల ధరలు డిసెంబర్లో 20.35 శాతానికి పెరిగాయి. ఫుట్‌వేర్ ధరలు 11.47 శాతం, ఫ్యూయల్ అండ్ లైట్ ధరలు 10.97 శాతం, పాల ఉత్పత్తుల ధరలు 8.51 శాతంగా నమోదయ్యాయి.
డిసెంబర్ సీపీఐ అంచనాల కంటే తక్కువగా నమోదైనా.. కీలక వస్తువుల ధరలు ఇంకా పైపైకి దూసుకెళ్తూనే ఉన్నాయని, కోర్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉందని కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసన భరద్వాజ్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

