సొంతిల్లు.. ఏది బెటర్
సొంతిల్లు మనలో ప్రతి ఒక్కరికీ ఓ కామన్ ఎమోషన్, సోషల్ స్టేటస్. ఉద్యోగంలో స్థిరపడగానే మొదటగా ఆలోచించే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సొంతింటి కల నేరవేర్చుకోవడమే. అయితే ధర కాస్త ఎక్కువ పట్టైనా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు మూవ్) ఇంటికి వెళ్దామా..
సొంతిల్లు మనలో ప్రతి ఒక్కరికీ ఓ కామన్ ఎమోషన్, సోషల్ స్టేటస్. ఉద్యోగంలో స్థిరపడగానే మొదటగా ఆలోచించే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సొంతింటి కల నేరవేర్చుకోవడమే. అయితే ధర కాస్త ఎక్కువ పట్టైనా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు మూవ్) ఇంటికి వెళ్దామా.. నాలుగు రోజులు లేటైనా కాస్త తక్కువ ధరకు దొరికే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకుందామా
అనే దైలమా చాలామందిలో ఉంటోంది. ఇందులో ఉండే ప్లస్, మైనస్ ఏంటో ఒకసారి చూద్దాం.
నిర్మాణంలో ఉన్న నివాసం
నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ సాధారణంగానే కాస్త రేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బిల్డర్‌కు నిధుల కొరత ఉంటుంది కాబట్టి మీరిచ్చే డౌన్ పేమెంట్, బ్యాంకులిచ్చే మైల్ స్టోన్ పేమెంట్లతోనే వాళ్ల బర్డెన్ కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల తక్కువకే మీకు ఇల్లు లభిస్తుంది. రెడీ టు ఆక్యుపై వాటితో పోల్చితే కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకూ ధరలో తేడా ఉండొచ్చు. ఇదే మీకు బాగా కలిసొచ్చే అంశం, టెంప్టింగ్ పాయింట్ కూడా. ఇందులో కాస్త పెద్ద ప్రాపర్టీ కొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువే. ప్రీ-ఈఎంఐ చెల్లిస్తారు కాబట్టి వడ్డీ భారం సైతం తక్కువగానే ఉంటుంది. గృహ రుణంపై ఇక్కడ ఇంట్రెస్ట్ మాత్రమే చెల్లిస్తారు.. అసలు చెల్లించరు. ఇక నిర్మాణం జరుగుతోంది కనుక మీ అభిరుచికి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కట్టిన ఇంట్లో ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బిల్డింగ్ నిర్మాణం ఎలా అవుతోంది.. మెటీరియల్ ఏం వాడుతున్నారు.. వర్క్ ఎంత క్వాలిటీగా ఉందని మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు.
ఇక సమస్యలివి..
- డెవలపర్ ఆర్థిక స్థోమతపై మనకు క్లారిటీ ఉండదు.
- అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తవుతుందనే కచ్చితమైన భరోసా లేదు.
- నిర్మాణ, పర్యావరణ సంబంధ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వంటి వాటిల్లో జాప్యం జరుగవచ్చు. ఒక్కోసారి ఊహించిన దానికంటే చాలా ఆలస్యం కావచ్చు. ఇది ఆర్థికంగా మనపై ప్రభావాన్ని చూపిస్తుంది.
- నిర్మాణం ఆలస్యమైతే అటు అద్దె కట్టుకోవాలి, ఇటు ఈఎంఐలు చెల్లించాలి. ఇది మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు.
పూర్తయిన ఇల్లు
సాధారణంగానే ఈ ఇండ్లు ధర ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్.. ఎస్ఎఫ్టీ రూ.5,500 ఉంటే, ఇది రూ.6,500/7,000 వరకూ ఉండొచ్చు. అయితే ఎలివేషన్, డిజైన్, నిర్మాణ నాణ్యత అన్నీ మనకు నచ్చితేనే ఎంపిక చేసుకోవచ్చు. కండ్ల ముందు ప్రాపర్టీ కనిపిస్తోంది కాబట్టి మనకు మరింత నమ్మకం కలుగుతుంది. వెంటనే చేరిపోయే అవకాశంతోపాటు ఈఎంఐలో అద్దె నగదు భర్తీ వల్ల భారం ఉండదు. ట్యాక్స్‌పేయర్లు పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను వెంటనే పొందవచ్చు.
ఇదీ సంగతి..
రెడీ టు మూవ్ ఇండ్లను కొన్నవారిలో మెజారిటీ కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో నాణ్యతా వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిల్డర్ల అత్యాశ కొంపముంచుతున్నది. ఇండ్లు కడుతున్నప్పుడు నాసిరకం మెటీరియల్ వాడటం, అరకొర వాటర్ క్యూరింగ్ ప్రాసెస్, అగ్గువకే దొరికే వైరింగ్, విద్యుత్తు సామాగ్రి ఫిట్టింగ్, ఫ్లోరింగ్, ప్లంబింగ్, శానిటరీ ఉత్పత్తులను వాడుతుండటం సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. దీంతో ఇల్లు కొన్నప్పుడు బాగానే ఉన్నా.. కొద్ది నెలలకే గోడలకు తేమ రావడం, పగుళ్లు ఏర్పడటం జరుగుతున్నాయి.
వర్షాకాలంలో శ్లాబులో నుంచి నీరు కారుతుండగా.. ఎండాకాలంలో ఓవర్ లోడ్‌తో విద్యుత్తు వైరింగ్ ఫెయిలైపోవడం ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెడుతున్నది. కాలంతో సంబంధం లేకుండా వాటర్ పైపుల లీకేజీలు ఉండనే ఉంటున్నాయి. కానీ నిర్మాణంలో ఉన్న ఇండ్ల విషయంలో ఈ తరహా సమస్యల్ని కొనుగోలుదారులు అధిగమించగలుగుతున్నారు. కాకపోతే సరైన బిల్డర్ దొరక్కపోతే నిర్మాణ సమయం పెరిగి అనవసరపు ఆర్థిక ఇబ్బందుల్ని మాత్రం చవిచూడాల్సి వస్తున్నది. మొత్తానికి సమయం ఉంటే సరైన పర్యవేక్షణతో నిర్మాణంలో ఉన్న ఇండ్లనే కొనేందుకు మొగ్గు చూపాలన్నది మెజారిటీ నిపుణుల మాట. నమ్మకమున్న, తెలిసిన బిల్డర్ల దగ్గర్నుంచో, పేరున్న సంస్థల ప్రాజెక్టుల నుంచో కొనుక్కోవడం ఉత్తమం. -నాగేంద్రసాయి కుందవరం
ప్రతికూలతలు
- ధర ఎక్కువపెట్టి కొనాలి.
- కొన్నిసార్లు చిన్న ప్రాపర్టీకి కూడా స్థలం విషయంలో రాజీపడాల్సి రావచ్చు.
- నిర్మాణానికి పట్టిన సమయం తెలియదు.
- ఏ మెటీరియల్ వాడారో చూడలేం.
- ఇంటీరియర్ క్వాలిటీనీ నమ్మలేని పరిస్థితి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

