Renault India : భారత్‌లో రెనాల్ట్ బంపర్ సేల్స్..అరుదైన మైలురాయికి చేరిక!
భారత్‌లో రెనాల్ట్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయి చేరుకుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో రెనాల్ట్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయి చేరుకుంది. ఫ్రెంచ్ కార్లతయారీ కంపెనీ రెనాల్ట్ భారత్‌లో 8 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. పదేండ్ల కిందట భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన రెనాల్ట్ దేశీ ఆటోమొబైల్ మార్కెట్లో అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం రెనాల్ట్ ఇండియా భారత్‌లో రెనాల్ట్ కైగర్, క్విడ్, ట్రైబర్, డస్టర్ వంటి నాలుగు కార్లను విక్రయిస్తోంది.
భారత్‌లో తాము 8 లక్షల కార్ల విక్రయాలను అధిగమించి అరుదైన మైలురాయి చేరుకున్నామని రెనాల్ట్ ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. ఈ ఘనతను సాధించేందుకు తమకు సహకరించిన కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారులు, ఉద్యోగులకు తమ బ్రాండ్ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత కొన్నేండ్లుగా భారత్‌లో తాము పటిష్ట పునాదిని ఏర్పరచుకున్నామని, పటిష్ట ప్రోడక్ట్ వ్యూహాలతో కస్టమర్లకు మెరుగైన డ్రైవింగ్ అనుభూతి అందించేలా అన్ని విభాగాల్లో మెరుగైన సేవలందించామని చెప్పారు.
ఇవన్నీ భారత్‌లో రెనాల్ట్ గ్రోత్ స్టోరీకి సహకరించాయని వివరించారు. చెన్నైలోని తమ అత్యాధునిక తయారీ ప్లాంట్, టెక్నాలజీ సెంటర్, లాజిస్టిక్స్, డిజైన్ సెంటర్ల వెన్నుదన్నుతో రెనాల్ట్ ఇండియా పోర్ట్‌పోలియో విజయవంతమైందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో పాటు రవాణా సమస్యలు ఎదురైనా 2021లో కంపెనీ అద్భుత వృద్ధి కనబరిచిందని చెప్పారు. రెనాల్ట్ గ్లోబల్ సేల్స్‌లో భారత్ టాప్ ఫైవ్ గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Cars
- Renault India
- sales
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

