రిలయన్స్‌కు ఖర్చుల సెగ

- క్యూ1లో 7 శాతం తగ్గిన నికర లాభం
- రూ.1.44 లక్షల కోట్లకు ఆదాయం
ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్‌వేవ్ బ్రేక్‌వేసింది. చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలకు నిర్వహణ ఖర్చులు గండికొట్టాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.12,273 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.13,233 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 58.2 శాతం ఎగబాకి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.91,238 కోట్లుగా ఉన్నది.
- నిర్వహణ ఖర్చులు, పన్నులు 50 శాతం వరకు పెరిగాయి. దీంతో రూ.1.31 లక్షల కోట్ల నిధులు వెచ్చించింది.
- ప్రస్తుతం కేజీ బేసిన్లో 18 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నది.
- కంపెనీ షేరు తగ్గి రూ.2,105 వద్ద నిలిచింది.
కరోనాలోనూ రిటైల్ జోరు
కరోనా సెకండ్‌వేవ్‌లోనూ రిలయన్స్ రిటైల్ భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో నికర లాభంలో 80 శాతం వృద్ధిని సాధించింది. రూ.1,941 కోట్ల లాభాన్ని గడించినట్లు పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,079 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఏడాది క్రితం రూ.28,197 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికంలో రూ.33,566 కోట్లకు ఎగబాకింది.
జియో దూకుడు
టెలికం వెంచర్ జియో లాభాల్లో దూసుకుపోతున్నది. గడిచిన త్రైమాసికంలో జియో రూ.3,651 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,519 కోట్లతో పోలిస్తే 44.9 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.8 శాతం ఎగబాకి రూ.18,952 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.17,254 కోట్లుగా ఉన్నది. గత త్రైమాసికంలో కొత్తగా 2.67 కోట్ల మంది వినియోగదారులు చేరడంతో మొత్తం సంఖ్య 44 కోట్లకు చేరుకున్నారు. ఒక్కొక్కరి నుంచి సరాసరిగా రూ.138.40 ఆదాయం ఆర్జించినట్లు అయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

