న్యూఢిల్లీ, జనవరి 2: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఉత్పత్తి మరింత తగ్గింది. డిసెంబర్ నెలలో సంస్థ 1,21,028 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 1,24,722 యూనిట్లతో పోలిస్తే 2.96 శాతం తగ్గినట్టు పేర్కొంది. వీటిలో ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,24,135 యూనిట్ల నుంచి 1,19,518 యూనిట్లకు తగ్గాయని తెలిపింది. అలాగే లైట్ కమర్షియల్ వాహనం సూపర్ క్యారీ ప్రొడక్షన్ 587 యూనిట్ల నుంచి 1,510 యూనిట్లకు పెరిగాయి.