Redmi A3 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ ఏ3 (Redmi A3) ఫోన్ను ఈ నెల 14న ఆవిష్కరిస్తుంది. ఫ్లిప్ కార్ట్, ఎంఐ డాట్ కాం ద్వారా దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. లార్జ్ సర్క్యులర్ రేర్ కెమెరా మాడ్యూల్తోపాటు ఆల్ న్యూ హలో డిజైన్ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్ ప్లే ఉంటుంది. 6జీబీ ర్యామ్ వస్తున్న ఈ ఫోన్లో వర్చువల్గా మరో 6జీబీ ర్యామ్ వరకూ పొడిగించుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు.
రెడ్మీ ఏ3 ఫోన్ 6.71 అంగుళాల హెచ్డీ+ (1600 x720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బ్యాక్డ్ 13-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.