Redmi 13 5G | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Redmi 13 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Redmi 13 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లోకి రెడ్మీ ప్రవేశించి పదేండ్లవుతోంది. ఈ నేపథ్యంలో రెడ్మీ (Redmi) తన రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) ఫోన్‌ను ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఫోన్ 108 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ 3ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) ఫోన్ 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,499 లకు లభిస్తుంది. హవేలియన్ బ్లూ, బ్లాక్ డైమండ్, ఆర్చిడ్ పింక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందీ ఫోన్. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, కంపెనీ ఆన్ లైన్ స్టోర్ తోపాటు రిటైల్ షోరూముల్లో ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. సెలెక్టెడ్ బ్యాంకు కార్డు సాయంతో కొనుగోలు చేస్తే రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ షియోమీ హైపర్ ఓఎస్ స్కిన్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోపాటు 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 4 ఎన్ఎం ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) ఫోన్ శాంసంగ్ ఐఎస్ఓసీఈఎల్ఎల్ హెచ్ఎం6 సెన్సర్ తోపాటు 108-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా 3ఎక్స్ ఇన్ సెన్సర్ జూమ్ ఆప్షన్ తో వస్తోంది. ఇంకా 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఇన్ ఫ్రా రెడ్ ట్రాన్స్ మీటర్, బయో మెట్రిక్ అథంటికేసన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

