Redmi 13 4G | త్వరలో భారత్ మార్కెట్లోకి రెడ్మీ 13 4జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Redmi 13 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్ మీ 13 4జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Redmi 13 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్ మీ 13 4జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్న ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ91 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. రెడ్ మీ 13 4జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ సుమారు రూ.16,500 (199 యూరోలు), 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.19 వేలు (229 యూరోలు) పలుకుతుంది. బ్లాక్, బ్లూ కలర్స్ తోపాటు పింక్, ఎల్లో షేడ్స్ తో వస్తుందని చెబుతున్నారు.
ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు రెండు సర్క్యులర్ కెమెరా యూనిట్లతో రెడ్ మీ 13 4జీ ఫోన్ వస్తోంది. గ్లోషీ ఫినిష్ తో హ్యాండ్ సెట్ వస్తుంది. స్పీకర్ గ్రిల్లె, మిక్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఎడ్జ్ రైట్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.79 అంగుళాల ఫఉల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, మీడియాటెక్ హెలియో జీ91 ఆల్ట్రా ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. బ్లూటూత్ 5.0, డ్యుయల్ బాండ్ వై-ఫై కనెక్టివిటీ ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

