Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ నార్జో ఎన్65 5జీ .. భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఐపీ54 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
రియల్ మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,499లకు లభిస్తుంది. అంబర్ గోల్డ్, డీప్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుందీ ఫోన్. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, రియల్మీ ఇండియా వెబ్ సైట్‌ల్లో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ నెల 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద రియల్మీ రూ.1000 కూపన్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.10,499లకే లభిస్తుంది.
రియల్మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 స్కిన్ ఓఎస్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 625 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, సెల్ఫీ షూటర్ కోసం సెంటర్లో హోల్ పంచ్ కటౌట్ డిస్ ప్లే ఉంటాయి. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 6జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది.
రియల్ మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 128 జీబీ స్టోరేజీ గల ఫోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగా బైట్ల వరకూ పెంచుకోవచ్చు. హోల్ పంచ్ కటౌట్ వద్ద చార్జింగ్ స్టేటస్, ఇతర ముఖ్యమైన అలర్టలతో కూడిన డిస్ ప్లే తెలిపేందుకు మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ ఉంటుంది.
రియల్ మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. తడి చేతులతోనూ ఆపరేట్ చేసేందుకు వీలుగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ జత చేశారు. రివర్స్ చార్జింగ్ కు మద్దతుగా క్విక్ చార్జ్ ఫీచర్ ఉంటుంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. సింగిల్ చార్జింగ్ తో 39.4 గంటల కాలింగ్ టైం, 28 రోజుల స్టాండ్ బై ఉంటది.