Realme Narzo N53 | రియల్మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. మార్కెట్లో నార్జో ఎన్53 లాంచింగ్ !
Real me Narzo N53 | భారత్ మార్కెట్లోకి రియల్ మీ మరో బడ్జెట్ ఫోన్ ‘నార్జో ఎన్53’ ఆవిష్కరించింది. దీని ధర రూ.8999గా నిర్ణయించింది.
Realme Narzo N53 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. ‘రియల్మీ నార్జో ఎన్53 (Realme Narzo N53)’ గురువారం ఆవిష్కరించింది. అత్యంత స్లిమ్‌గా ఉండే రియల్మీ నార్జో ఎన్53 ఫోన్ (Realme Narzo N53).. ఒక్టాకోర్ యూనిసోక్ టీ612 చిప్ సెట్ తో వస్తున్నది. రెండు రంగుల, రెండు వేరియంట్లలో లభిస్తుంది. 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ యూనిట్ విత్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్లో రియల్మీ విడుదల చేసిన ‘నార్జే’ సిరీస్ ఫోన్లలో రెండవది. ఐ-ఫోన్14ప్రో’లో మాదిరిగా మినీ క్యాప్సూల్ ఫీచర్ కూడా ఉంది.
ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న రియల్మీ నార్జో ఎన్53 ఫోన్ (Realme Narzo N53) 4జీబీరామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ రూ.8,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు సొంతం చేసుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు హోల్డర్లకు రూ.1000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెల 24 నుంచి రియల్మీ ఆన్లైన్ స్టోర్, అమెజాన్‌ల్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ లో భాగంగా బేస్ వేరియంట్ ఫోన్ మీద రూ.500, హై వేరియంట్ మీద రూ.1000 డిస్కౌంట్ కల్పిస్తున్నది. ఈ నెల 22 మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు 4జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ పై రూ.750, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ మీద రూ.1000 వరకు రాయితీ అందిస్తున్నది.
రియల్మీ నార్జో ఎన్53 ఫోన్ (Realme Narzo N53) 6.74-అంగుళాల డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 90హెర్ట్జ్, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్, 450 నిట్స్ బ్రైట్ నెస్, ఒక్టాకోర్ యూనీసోక్ టీ 612 ఎస్వోసీ చిప్ సెట్, 6జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ వర్చువల్ రామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్సన్ కూడా ఉంది. ఎంట్రీ లెవల్ రియల్మీ నార్జో ఎన్53 ఫోన్ ఆండ్రాయిడ్13 విత్ రియల్మీ యూఐ 4.0 వర్షన్ పై పని చేస్తుంది. రియల్మీ మినీ క్యాప్సూల్ ఫీచర్ కూడా జత చేశారు.
50-మెగా పిక్సెల్ ఏఐ ప్రైమరీ సెన్సర్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటది. సెల్ఫీల కోసం ఫ్రంట్ లో 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్స్ వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్షన్ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

