Realme Narzo 70 Turbo 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియల్మీ నార్జో 70 టర్బో 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme Narzo 70 Turbo 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme Narzo 70 Turbo 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. లెటెస్ట్ గేమింగ్ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్ ఇది. రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 6.67 అంగుళాల శాంసంగ్ ఈ4 ఓలెడ్ స్క్రీన్ విత్ జీటీ మోడ్ తో వస్తున్నది. ప్రధాన గేమ్ టైటిళ్ల కోసం 90ఎఫ్పీఎస్ ఆఫర్ చేస్తోంది.
రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు లభిస్తుంది. టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. రియల్మీ ఇండియా వెబ్ సైట్, అమెజాన్ ద్వారా ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ పోన్ కొనుగోలుదారులకు రూ.2000 స్పెషల్ కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది రియల్మీ.
రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5.0 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీప్రెష్ రేటు, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) శాంసంగ్ ఈ4 ఓలెడ్ స్క్రీన్ ఉంటుంది. దీన్ని ’ఓలెడ్ ఎస్పోర్ట్స్ డిస్ ప్లే’ అని పిలుస్తారు. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కలిగి ఉంటుంది.
రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ వర్చువల్ గా 26 జీబీ వరకూ ర్యామ్ పెంచుకోవచ్చు. 50-మెగా పిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ రేర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బైదూ, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరేసన్ సెన్సర్, ఫ్లిక్సర్ సెన్సర్, గైరో మీటర్, లైట్ సెన్సర్, మ్యాగ్నటిక్ ఇండక్షన్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

