Realme GT 7 Pro | ఏడాది చివరల్లో భారత్ మార్కెట్లోకి రియల్మీ జీటీ 7 ప్రో
Realme GT 7 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ టీజీ 7 ప్రో ఫోన్‌ను త్వరలో భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Realme GT 7 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ టీజీ 7 ప్రో ఫోన్‌ను త్వరలో భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. గతవారమే రియల్మీ టీజీ 6 ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా రియల్మీ టీజీ 7 ప్రో ఫోన్ ఆవిష్కరణపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ చేజ్ జూ ధృవీకరించారు. ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లోకి రియల్మీ టీజీ 7 ప్రో ఎంటరయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వాల్ కామ్ నెక్ట్స్ జనరేషన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
గతవారం తన మిడ్ రేంజ్ ఫోన్ రియల్మీ జీటీ 6టీ.. భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.30,999 నుంచి ప్రారంభం అవుతుంది. మంగళవారం నుంచి అమెజాన్, రియల్మీ ఇండియా వెబ్ సైట్ ద్వారా సేల్స్ ప్రారంభం అయ్యాయి.రియల్మీ జీటీ 6టీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 2780×1264 పిక్సెల్స్ రిజొల్యూషన్ ఉంటుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుందీ ఫోన్. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.
ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందీ రియల్మీ జీటీ 6టీ ఫోన్. 50-మెగా పిక్సెల్ విత్ ఓఐఎస్ సోనీ ఎల్వైటీ-600 మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన 7+ జెన్ 3 చిప్ సెట్ తో వస్తోంది. 4ఎన్ఎం టీఎస్ఎంసీ ప్రాసెస్ తో ఈ ప్రాసెసర్ నిర్మించారు. 9- లేయర్డ్ 10014ఎంఎం స్క్వేర్ ఆఫ్ 3డీ టెంపర్డ్ వీసీతో కూడిన ఐస్ బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంటది. 120 వాట్ల సూపర్ వూక్ చార్జర్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. ఈ ఫోన్ కు మూడేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

