Realme GT 5 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ జీటీ5 ప్రో (Realme GT 5 Pro) త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. సోనీ నెక్ట్స్ జనరేషన్ ల్వెతియా ఎల్వైటీ 808 (LYTIA LYT808) సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. దీంతోపాటు ఓమ్నీ విజన్ ఓవీ08డీ10 సెకండరీ సెన్సర్, సోనీ ఐఎంఎక్స్ 890 టెలిఫోటో సెన్సర్ కెమెరా లేదా రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్స్ కెమెరాలు, 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుంది. అయితే, భారత్ మార్కెట్లో రియల్మీ జీటీ 5 ప్రో ఆవిష్కరణ తేదీని ఇంకా వెల్లడించలేదు.రియల్మీ జీటీ 5జీ ప్రో ఫోన్ 6.78 అంగుళాల (1264×780 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ లేదా ఒక టిగా బైట్ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తున్నది. 100 వాట్ల వైర్డ్ చార్జింగ్ లేదా 50 వాట్ల వైర్లెస్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.