రియల్ మీ సంచలనం..తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో రియల్ మీ సంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి వినియోగదారులకు ఫేవరేట్ బ్రాండ్ గా మారిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ గా చౌకధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. రియల్ మీ 8 సిరీస్ లో 5జీని రెండు వేరియంట్లలో తీసుకువచ్చింది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లలో ఉన్న 5జీ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ధర చాలా తక్కువ. కేవలం రూ.15,000 వేలకే ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. రియల్మీ 8 5జీ సేల్ ఏప్రిల్ 28 మధ్యాహ్నం 12 గంలకు మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్ మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
రియల్మీ 8 5జీ ఫీచర్స్ :
డిస్ప్లే: 6.5 అంగుళాల IPS LCD, 90Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 4 GB, 8 GB
ఇంటర్నల్ స్టోరేజ్: 128 GB
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
రియర్ కెమెరా: 48 MP + 2 MP + 2 MP
ఫ్రంట్ కెమెరా: 16 MP
బ్యాటరీ: 5000 mAh (18W క్విక్ ఛార్జ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + రియల్మీ 2.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: సూపర్ సోనిక్ బ్లూ, సూపర్సోనిక్ బ్లాక్
ధర: 4 GB +128 GB – రూ.14,999
8 GB +128 GB – రూ.16,999
ఇండియన్ మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్లో కూడా రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- India
- REALME 8 5G
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

