Realme 13 Pro | త్వరలో భారత్ మార్కెట్లోకి ఏఐ ఫీచర్లతో రియల్ మీ 13 ప్రో సిరీస్ ఫోన్లు..!
Realme 13 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్ మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
Realme 13 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్ మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రియల్మీ (Realme) తన రియల్మీ 13 ప్రో సిరీస్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ ఆల్ట్రా క్లియర్ కెమెరా ఫీచర్ జత చేసింది. ఇందులో సోనీ ఎల్వైటీ 701 కెమెరా సెన్సర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. రియల్మీ 13 ప్రో సిరీస్ ఫోన్లలో రియల్మీ 13 ప్రో+, రియల్మీ 13 ప్రో ఫోన్లు ఉంటాయి.
రెండు ఫోన్లలోనూ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఎల్వైటీ -701 కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 పెరిస్కోప్ కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కేపబిలిటీ కలిగి ఉంటుంది. హైపర్ ఇమేజ్ + – త్రీ లేయర్ ఏఐ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్ తో ఈ ఫోన్లలో కెమెరా సిస్టమ్ వస్తోంది. డివైజ్ ఏఐ ఇమేజింగ్ ఆల్గోరిథమ్స్, క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ కు మద్దతుగా ఉంటుంది. రియల్మీ 13 ప్రో ఫోన్లలో ఏఐ ప్యూర్ బొకెహ్, ఏఐ నాచురల్ స్కిన్ టోన్, ఏఐ ఆల్ట్రా క్లారిటీ ఫీచర్లు ఉంటాయని రియల్మీ తెలిపింది.
రియల్మీ 13 ప్రో+ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మద్దతుతో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తున్నది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

