Realme 11 Pro 5G | వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి రియల్ మీ 11 ప్రో సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిపికేషన్స్..
Realme 11 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ వచ్చేనెల రెండోవారంలో భారత్ మార్కెట్లోకి రియల్ మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించనున్నారు.
Realme 11 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. త్వరలో భారత్ మార్కెట్లోకి ‘రియల్ మీ 11 ప్రో 5జీ (Realme 11 Pro 5G) తీసుకు రానున్నది. వచ్చేనెలలో మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. రియల్ మీ 11 ప్రో 5జీ(Realme 11 Pro 5G) తోపాటు రియల్ మీ 11 ప్రో + (Realme 11 Pro 5G +) వచ్చే నెల రెండో వారంలో మార్కెట్లోకి రానున్నాయి. వీటితోపాటు రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్జ్ కూడా వస్తాయి. ఈ రెండు ఫోన్లు ఈ నెలలోనే చైనా మార్కెట్లో ఆవిష్కరించారు. రెండు వేరియంట్ ఫోన్లు మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి.
అనధికారిక సమాచారం ప్రకారం వచ్చే నెల ఎనిమిదో తేదీన రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో + ఫోన్లతోపాటు రియల్ మీ ఎయిర్ 5 ప్రో టీడబ్ల్యూఎస్ ఎయిర్ బడ్స్ కూడా మార్కెట్లోకి రానున్నాయి.
రియల్ మీ 11 ప్రో ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లుగా.. రియల్ మీ 11 ప్రో + ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ రామ్ విత్ 256 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఆప్షన్లతో వస్తున్నాయి. ఆస్ట్రల్ బ్లాక్, సన్ రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్ షేడ్స్ రంగుల్లో లభిస్తాయి.
రియల్ మీ 11 ప్రో ధర సుమారు రూ.20 వేలు (1699 చైనా యువాన్లు), రియల్ మీ 11 ప్రో + ఫోన్ ధర రూ.24 వేల (1999 చైనా యువాన్లు) కు లభిస్తాయి.
రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో + ఫోన్లు రెండూ 6.7 -అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1,080×2,412 పిక్సెల్స్) కర్వుడ్ డిస్ ప్లే విత్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటాయి. ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్, కలిగి ఉంటాయి.
రియల్ మీ 11 ప్రో ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా విత్ 100-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, రియల్ మీ 11 ప్రో+ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ విత్ 200-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్పీ3 సెన్సర్ కలిగి ఉంటాయి.
రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో + ఫోన్లు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. రియల్ మీ 11 ప్రో ఫోన్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ విత్ ది బండిల్డ్ చార్జర్, రియల్ మీ 11 ప్రో + విత్ 100 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

