Real Estate Giant | కుప్పకూలిన రియల్ దిగ్గజం : దివాళా పిటిషన్ దాఖలు చేసిన ఎవర్‌గ్రాండే
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్‌లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
బీజింగ్ : చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్‌లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 2021లో చైనా ఆర్ధిక వ్యవస్ధలో స్ధిరాస్తి సంక్షోభం తలెత్తడంతో రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎవర్‌గ్రాండే డిఫాల్టర్‌గా తేలింది. స్ధిరాస్తి సంక్షోభ ప్రకంపనలు వెంటాడటంతో రియల్ ఎస్టేట్ దిగ్గజం కోలుకోలేని దెబ్బతిని దివాళా పిటిషన్‌తో చేతులెత్తేసింది.
గత సంవత్సరాంతానికి ఎవర్‌గ్రాండే రుణాలు ఏకంగా 2.4 లక్షల కోట్ల యువాన్లకు చేరడంతో ప్రాపర్టీ డెవలపర్ రుణాలు చెల్లించలేని పరిస్ధితికి చేరుకుంది. ఎవర్‌గ్రాండే రుణాలు చైనా జీడీపీలో దాదాపు 2 శాతానికి ఎగబాకడం ఆందోళన రేకెత్తించింది.
చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే కుప్పకూలడంతో చైనాలోని ఇతర ప్రముఖ డెవలపర్లు కసియా, ఫంటాసియా, షిమావ్ గ్రూప్ సహా పలు కంపెనీలు సైతం రుణాల ఊబిలో చిక్కుకున్నాయి. నగదు నిల్వలు కుచించుకుపోవడంతో దిక్కుతోచని స్ధితిలో రుణాల పునర్వ్యవస్ధీకరణ సహా పలు మార్గాలను అన్వేషించనున్నట్టు మరో చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్ ఇటీవల వెల్లడించింది.
Read More :
Bomb Threat | విస్తారా విమానానికి బాంబు బెదిరింపు : ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

