ఆర్థిక మార్కెట్లపై ఆర్బీఐ నజర్
నగదు మార్కెట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు తదితర ఆర్థిక మార్కెట్లలో కీలక విధాన, కార్యాచరణ అంశాలపై దృష్టిసారించే ఆర్థిక విపణుల సాంకేతిక సంప్రదింపుల కమిటీని (టీసీసీఎఫ్ఎమ్) ఆర్బీఐ బుధవారం ఏర్పాటు చేసింది.
- రోహిత్ జైన్ అధ్యక్షతన కొత్త కమిటీ
ముంబయి, నవంబర్ 4: నగదు మార్కెట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు తదితర ఆర్థిక మార్కెట్లలో కీలక విధాన, కార్యాచరణ అంశాలపై దృష్టిసారించే ఆర్థిక విపణుల సాంకేతిక సంప్రదింపుల కమిటీని (టీసీసీఎఫ్ఎమ్) ఆర్బీఐ బుధవారం ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ (ఎఫ్ఎమ్ఆర్డీ) బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ మారక మార్కెట్లు, వాటికి సంబంధించిన ఒప్పందాల మార్కెట్లు, మౌలిక సదుపాయాల విధాన, కార్యాచరణ అంశాలపై మార్కెట్ భాగస్వాములు, ఇతర వర్గాలతో ఆర్బీఐ క్రమబద్ధంగా సంప్రదింపులు జరిపేందుకు ఈ కమిటీ వేదికగా పనిచేస్తుంది.
ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, రిపోర్టింగ్తోపాటు ఇతర మార్కెట్ మౌలిక సదుపాయాలు, వాటికి సంబంధించిన నియంత్రణ, కార్యాచరణ విధానాల అంశాలను టీసీసీఎఫ్ఎమ్ పరిశీలిస్తుంది. ఆర్బీఐ చర్యల అమలు, మార్కెట్లలో అనుకోకుండా ఏర్పడే ఆటంకాల గుర్తింపుతోపాటు ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేసే కొత్త విధాన, కార్యాచరణ సమస్యలను కూడా కమిటీ పరిశీలిస్తుంది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు, ఆర్థిక రంగ ఆవిష్కరణలు, భారత ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపే కొత్త ముప్పులపైనా దృష్టిసారిస్తుంది. కాగా, కమిటీ సమావేశాలను ప్రతి త్రైమాసికంలో కనీసం ఒకసారి నిర్వహిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ కమిటీలో సెబీ పూర్తికాల మాజీ సభ్యుడు, అనంత్ నారాయణ్, యాక్సిస్ బ్యాంక్ ఈడీ నీరజ్ గంభీర్, ఐసీఐసీఐ బ్యాంక్, సిటీబ్యాంక్ ప్రతినిధులు, తదితరులున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

