వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ..

ముంబై: ఆర్బీఐ వడ్డీ రేట్లు మారలేదు. రెపో రేటు, రివర్స్ రెపో రేటును ఆర్బీఐ ఈసారి కూడా యధాతథంగా ఉంచింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రెపో రేటును 4 శాతంగా ఉంచినట్లు తెలిపారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచారు. మళ్లీ కోవిడ్ విజృంభణతో దేశీయ ఆర్థిక ప్రగతి అస్థిరంగా మారినట్లు ఆయన తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్ల ఇలా జరిగినట్లు ఆయన తెలిపారు. మార్కెట్లకు కావాల్సినంత ద్రవ్యాన్ని అందించనున్నట్లు శక్తికాంత్‌దాస్ వెల్లడించారు. ద్రవ్యపరపతి విధానంలో భాగంగా భారతీయ బ్యాంకులకు కొత్తగా 50వేల కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
ఈసారి కూడా గృహ, ఆటో రుణగ్రహీతలకు ఊరట దక్కలేదు. రెపో, రివర్స్ రెపో రేట్లను మార్చకపోవడం వల్ల.. గృహ, ఆటో రుణాలు తీసుకున్నవారికి పెద్దగా కలిసిరాదు. వడ్డీ రేట్లలో మార్పులేని కారణంగా.. గృహ, ఆటో రుణాలపై ఈఎంఐలు కూడా తగ్గవు. ఏప్రిల్ అయిదో తేదీ నుంచి ఏడు తేదీ వరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి కమిటీ సమావేశమైంది. ఆరుగురు సభ్యుల బృందం తీసుకున్న నిర్ణయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

