New Bank Locker Rules | లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్‌కు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?!
New Bank Locker Rules | బ్యాంకు లాకర్ అగ్రిమెంట్ల రెన్యూవల్‌కు ఆర్బీఐ మళ్లీ గడువు పొడిగించింది. 2023 డిసెంబర్‌లోపు దశల వారీగా పూర్తి చేయాలని ఆదేశించింది.
New bank locker rules | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. విలువైన ఆభరణాలు, ఆస్తులు, ఇతరవిలువైన పత్రాలను లాకర్లలో భద్రపరుచుకుంటున్నారు. ఖాతాదారులు లాకర్లలో దాచి పెట్టిన ఆభరణాలు, విలువైన పత్రాలకు మరింత సేఫ్టీ కల్పించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలు మెరుగు పరిచింది. లాకర్ల డిపాజిటర్లు.. తమ బ్యాంకులతో అగ్రిమెంట్లను రెన్యూవల్ చేసుకునే సమయంలో అదనపు గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్‌కు అర్హమైన ధృవ పత్రాలను సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు 2021 ఆగస్టులో సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
తొలుత 2022 జనవరి ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలు అమల్లోకి తేవాలని ఆదేశించింది. కానీ బ్యాంకులన్నీ భారీ స్థాయిలో తమ ఖాతాదారులతో లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్ చేసుకోలేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దశల వారీగా 2023 డిసెంబర్ చివరిలోగా లాకర్ అగ్రిమెంట్లు రెన్యూవల్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
లాకర్లు నిర్వహిస్తున్న బ్యాంకు శాఖల స్ట్రాంగ్ రూమ్, కామన్ ఆపరేషనల్ ప్రాంతాల పరిధిలో సీసీటీవీలు ఇన్స్టాల్ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఇక లాకర్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులు నిర్దిస్ట తేదీలోగా తమ లాకర్ అగ్రిమెంట్లను రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. 2021 ఆగస్టులో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 180 రోజుల్లోపు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని, వాటి రికార్డింగ్ అమల్లోకి రావాలని స్పష్టం చేసింది.
ఖాతాదారుడికి గానీ, బ్యాంకు అధికారులకు గానీ తెలియకుండా ఆయా లాకర్లు తెరువరాదు. ఏదైనా దొంగతనం జరిగినా, సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘన జరిగినా.. దానిపై తలెత్తే ఇబ్బందులు, వివాదాలపై పోలీసు దర్యాప్తు పూర్తయి, వివాదం సెటిల్ అయ్యే వరకు సదరు సీసీటీవీ కెమెరాలను నిల్వ చేయాల్సి ఉంటుంది.
జాతీయ విపత్తు, అగ్ని ప్రమాదం వల్ల గానీ, బ్యాంకు భవనం కూలిపోయినప్పుడు విలువైన ఆభరణాలు దెబ్బ తిన్నా, విలువైన పత్రాలు దెబ్బతిన్నా.. వాటి విలువకు 100 రెట్లు బ్యాంకు తమ లాకర్ ఖాతాదారులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల జరిగే నష్టానికి ఈ నిబంధన వర్తించదు.
ఈ కారణాల వల్ల దెబ్బతింటే 100 రెట్లు పరిహారం
లాకర్లలో దాచిపెట్టిన ఆభరణాలు, ఇతర వస్తువులు బ్యాంకుల తప్పిదాల వల్ల దెబ్బ తింటే, వాటిపై మీరు చెల్లించే అద్దె మీద 100 రెట్లు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ బ్యాంకర్దే.బ్యాంకు లాకర్లు ఉన్న భవనం కూలిపోయినా, అగ్ని ప్రమాదం జరిగినా, దోపిడీ జరిగినా.. బ్యాంకు ఉద్యోగి మోసం చేసినా లాకర్లు అద్దెకు తీసుకున్న వారికి పరిహారం చెల్లించాల్సిందే. ఒకవేళ ఖాతాదారు పొరపాటు ఉంటే ఆ పరిహారం వర్తించదు.
కస్టమర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వాలంటే..
ఒకవేళ లాకర్‌ను షిప్ట్ చేయాలని బ్యాంకు నిర్ణయిస్తే సంబంధిత ఖాతాదారుకు ముందుగానే తెలియజేయాలి. లాకర్ డిపాజిట్ల రూమ్ వద్ద 180 రోజులు సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయాలి. ఇక మూడేండ్ల పాటు రెంట్ చెల్లించని డిపాజిట్ లాకర్లను తెరవాలా.. లేదా అని ఆ బ్యాంక్ అధికారులు నిర్ణయిస్తారు.
టర్మ్ డిపాజిట్ ఎందుకంటే..
మీరు కొత్తగా బ్యాంక్ లాకర్ కోసం దరఖాస్తు చేశారా.. అయితే, వాటి లభ్యతను బట్టి మీరు వెయిటింగ్లో ఉండాల్సి ఉంటుంది. బ్యాంకర్లు సేఫ్టీ డిపాజిట్ లాకర్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి. మీకు లాకర్ ఉంటే టర్మ్ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో లావాదేవీలు సాగుతున్నప్పుడు కూడా టర్మ్ డిపాజిట్లు చేయాలని బ్యాంకర్లు అడగరు. లాకర్ రెంట్ సకాలంలో చెల్లించడానికి టర్మ్ డిపాజిట్ చేయాలని బ్యాంకర్లు కోరతారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

