మార్కెట్లోకి డిజిటల్ రుపీ
ఎట్టకేలకు రిజర్వ్‌బ్యాంక్ డిజిటల్ కరెన్సీ-డిజిటల్ రుపీని (హోల్‌సేల్ సిగ్మెంట్) నవంబర్ 1 నుంచిమార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
- హోల్‌సేల్ విభాగంలో విడుదల చేస్తున్న ఆర్బీఐ
- నెల తర్వాత రిటైలర్లకు అందే అవకాశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఎట్టకేలకు రిజర్వ్‌బ్యాంక్ డిజిటల్ కరెన్సీ-డిజిటల్ రుపీని (హోల్‌సేల్ సిగ్మెంట్) నవంబర్ 1 నుంచిమార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ తొలి హోల్‌సేల్ పైలట్ ప్రాజెక్ట్‌లో విడుదలయ్యే డిజిటల్ రుపీ ఎంపికచేసిన బ్యాంక్‌లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో జరిపే లావాదేవీలకు మాత్రమే పరిమితం. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం డిజిటల్ రుపీని ఉపయోగించుకోవొచ్చని ఆర్బీఐ సోమవారం గుపకటనలో తెలిపింది. తదుపరి రోజుల్లో ఇతర హోల్‌సేల్ విభాగాలు, క్రాస్-బోర్డర్ చెల్లింపుల్లో పైలట్ ప్రాజెక్టుల్ని అమలు చేస్తామని ఆర్బీఐ తెలిపింది.
తొమ్మిది బ్యాంక్‌ల ఎంపిక
ఎస్బీఐ, ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా, యస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ-ఈ తొమ్మిది బ్యాంకుల్ని డిజిటల్ రుపీ పైలట్ ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి ఆర్బీఐ ఎంపికచేసింది. డిజిటల్ రూపీ (రిటైల్ సిగ్మెంట్) తొలి పైలట్‌ను నెలరోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రిటైల్ రుపీ ఎంపికచేసిన ప్రాంతా ల్లో కస్టమర్లు, వ్యాపారులతో కూడిన యూజర్ గ్రూప్‌లకు అందుబాటులో ఉండేలా విడుదల చేయాలన్నది ఆర్బీఐ ప్రతిపాదన.
బిట్కాయిన్లాంటిది కాదు
వాస్తవానికి ఆర్బీఐ ఇప్పుడు విడుదల చేస్తున్న డిజిటల్ రుపీ.. బిట్‌కాయిన్ తదితరాల్లా బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రూపొందిన క్రిప్టోకరెన్సీ కాదు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కరెన్సీకి మరో రూపం. ఒక్క రూపాయికి ఒక డిజిటల్ రుపీ సమానం. ఒక్కమాటలో చెప్పాలంటే మనం వాడుతున్న లీగల్ కరెన్సీలాంటిదే. కాకపోతే డిజిటల్ రూపంలోనే ఉంటుంది. ఈ డిజిటల్ రుపీ రిజర్వ్‌బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. ఈ కారణంగా రూపాయిలానే దీనికి కూడా లీగల్ టెండర్ వర్తిస్తుంది.
లాభమేంటి..!
ప్రస్తుతం వివిధ ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా చెల్లించడానికి ఉపయోగించే కరెన్సీ నోట్లకు మరో రూపమే డిజిటల్ రుపీ కూడా. కరెన్సీ నోట్లుగా కాకుండా డిజిటల్ రూపంలోనే దీనిని స్టోర్ చేసుకోవాలి. కానీ కాగితపు కరెన్సీగా కూడా డిజిటల్ కరెన్సీని మార్పిడి చేసుకోవచ్చు. ప్రయోజనాలివి..
- నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. కరెన్సీ ప్రింటింగ్, స్టోరేజ్, రవాణా, నోట్ల రీప్లేస్మెంట్ వ్యయాలు తగ్గుతాయి.
- ఇప్పుడు వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్న నగదుకు అదనపు ఆప్షన్‌గా డిజిటల్ రూపీ ఉపయోగపడుతుందని ఆర్బీఐ గతంలో విడుదల చేసిన నోట్లో తెలిపింది.
- ఇది డిజిటల్ సాధనమైనందున సులభంగా, వేగంగా, చౌకగా లావాదేవీలు జరపవచ్చన్నది. కరెన్సీ నోట్లుగా కాకుండా డిజిటల్ మార్గంలో డబ్బును చెల్లించేటపుడు లభించే ప్రయోజనాలన్నీ తాజా డిజిటల్ రూపీతో లభిస్తాయన్నది.
రిస్క్‌లేంటి..!
తాజాగా విడుదల చేస్తున్న డిజిటల్ రుపీ లావాదేవీ విధానాలు, డిపాజిట్లు, విత్‌డ్రాయిల్స్, వడ్డీ తదితర అంశాలపై ఆర్బీఐ నిర్దిష్టమైన నిర్ణయమేదీ ఇప్పటివరకూ తీసుకోలేదు. స్థూలంగా నిపుణులు వ్యక్తం చేస్తున్న రిస్క్లివి..
- ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలగవచ్చన్న భయాలున్నాయి. డిజిటల్ రుపీ వడ్డీ లభించే సాధనంగా విడుదలవుతుందా, లేక వడ్డీ రహిత సాధనంగా ఉంటుందా అనే అంశానికి అనుగుణంగా రిస్క్ ఉంటుంది.
- ఆర్బీఐ వద్ద బ్యాంకుల ఖాతాలకు వడ్డీ లభిస్తుంటే బ్యాంక్‌లు సైతం ఖాతాదారులు ప్రారంభించే డిజిటల్ రుపీ ఖాతాలకు కూడా వడ్డీ ఇవ్వాలి. ఈ ఖాతాల్లో ఉన్న డిజిటల్ రూపాయల నిష్పత్తి ఆధారంగా రుణ వితరణను పెంచుకోలేకపోతే బ్యాంక్‌లకు ఆ ఖాతాలు భారమైపోతాయి. బ్యాంక్‌లు రిస్క్‌లో పడిపోతాయి.
- బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం తలెత్తితే డిపాజిటర్లు వారి బ్యాంక్ డిపాజిట్లను డిజిటల్ రూపాయిల్లోకి మార్చుకుంటారు. దీంతో సంక్షోభం తీవ్రతరమవుతుంది.
- బ్యాంక్ ఇబ్బందుల్లో ఉన్నట్టు గుర్తిస్తే డిజిటల్ రుపీ డిపాజిట్లను ఖాతాదారులు వేగంగా విత్‌డ్రా చేసుకుంటారు. దీంతో బ్యాంక్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- CBDC
- digital rupee
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

