Ratan Tata biography | రతన్ టాటా బయోగ్రఫీ.. నవంబర్‌కల్లా రెడీ!
Ratan Tata biography | ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా జీవిత కథ.. రతన్ ఎన్ టాటా : ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ పేరుతో ప్రచురితం కానుంది.

Ratan Tata biography | రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు.. ప్రముఖ కార్పొరేట్ సంస్థ టాటా సన్స్‌కు గౌరవ చైర్మన్.. దేశంలోని ఉత్తమ పారిశ్రామికవేత్తలు.. దాతల్లో ఆయన ఒకరు. అంతేకాదు.. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు, వ్యాపార వేత్తలకు స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవిత చరిత్ర పుస్తక రూపం సంతరించుకోనున్నది. ఈ ఏడాది నవంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. రతన్ ఎన్ టాటా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ అనే పేరుతో ప్రచురితం కానున్నది. మాజీ బ్యూరోక్రాట్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ థామస్ మాథ్యూస్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది.
పరోపకారానికి మారుపేరు రతన్ టాటా
వ్యాపారపరంగా తప్పనిసరి పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులను అధిగమిస్తూ మందుకు సాగారు రతన్ టాటా. అయినా అపరిమితమైన పరోపకార సేవలు అందించడంలో ఆయనకు ఆయనే సాటి. భారత్‌లో పురాతన కాలం నాటి అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థ టాటా సన్స్‌కు ఆయన సారధిగా పని చేశారు.
రతన్ టాటా హయాంలో ఇలా
రతన్ టాటా హయాంలోనే టాటా సన్స్ జాగ్వార్ లాండ్ రోవర్, కోరస్ స్టీల్ తదితర సంస్థలను టోకేవర్ చేసుకున్నది. తద్వారా టాటా సన్స్.. ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థగా గుర్తింపు పొందింది. భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా సన్స్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 250 బిలియన్ డాలర్ల పై చిలుకే. 7.50 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నది. కార్ల తయారీ మొదలు బ్లెండ్ టీ, సాఫ్ట్వేర్, స్టీల్ తదితర రంగాల్లో 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
హార్పర్ కాలిన్స్‌కు ప్రచురణ హక్కులు
అన్ని భాషల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా టాటా జీవిత చరిత్ర పుస్తక ప్రచురణ హక్కులను భారత్‌కు చెందిన హార్పర్ కాలిన్స్ సొంతం చేసుకున్నది. హార్పర్ కాలిన్స్ ఇండియా.. భారత్‌లో ఇంగ్లిష్‌తోపాటు అన్ని భారతీయ భాషల్లో ప్రచురిస్తుంది. అమెరికాలో హార్పర్‌కాలిన్స్ లీడర్షిప్, బ్రిటన్‌లో విలియమ్ కాలిన్స్ ప్రచురిస్తారు. రతన్ టాటా జీవిత బయోగ్రఫీ పుస్తక ప్రచురణ బిడ్‌ను హార్పర్ కాలిన్స్ రూ.2 కోట్లకు కైవసం చేసుకున్నదని పలు వార్తలొచ్చాయి. కానీ హార్పర్ కాలిన్స్ దీన్ని ధ్రువీకరించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

