Punjab National Bank | పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు రెడీ
Punjab National Bank | ఖాతాదారులతోపాటు ఇతరులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
Punjab National Bank | బ్యాంకులు తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ Punjab National Bank (పీఎన్బీ PNB ) తన ఖాతాదారులకు, ఇతరులకు వాట్సాప్ బ్యాంకింగ్ ( WhatsApp banking ) సేవలు అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 919264092640 అనే వాట్సాప్ నంబర్‌కు hi/hello అనే మెసేజ్ పంపితే చాలు. వారికి వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలో తెలిపింది.

బాలెన్స్ ఎంక్వైరీ, చివరి ఐదు లావాదేవీలు, స్టాప్ చెక్, రిక్వెస్ట్ చెక్ బుక్ వంటి ఆర్థికేతర లావాదేవీలు వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా పొందొచ్చు. ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్, బ్యాంక్ డిపాజిట్ ఎంక్వైరీ, లోన్ ఉత్పత్తుల ఎంక్వైరీ, డిజిటల్ ప్రొడక్ట్స్, ఎన్నారై సేవలు, బ్యాంక్ శాఖ లేదా ఏటీఎం లొకేషన్, ఆప్ట్ ఇన్ opt-in, ఆప్ట్ ఔట్ opt-out ఆప్షన్లను ఖాతాదారులు, నాన్ అకౌంట్ హోల్డర్లకు
వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ( WhatsApp banking ) సెలవులతోపాటు 24×7 ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్ ( android ) , ఐవోఎస్ ( iOS ) ఆధారిత మొబైల్ ఫోన్లల్లో ఈ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. లావాదేవీలు, చాటింగ్ జరుపడానికి ముందు వాట్సాప్ పీఎన్బీ ప్రొఫైల్ నేమ్ మీద గ్రీన్ టిక్ వచ్చిందా.. లేదా.. తెలుసుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

