Union Bank of India Dress Code |అభ్యంతరాల మధ్య ఆ బ్యాంక్ డ్రెస్‌కోడ్ విత్‌డ్రా
Union Bank of India Dress Code | నవరాత్రి ఉత్సవాల్లో డ్రెస్‌కోడ్ సర్క్యులర్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్‌డ్రా చేసుకుంది.

Union Bank of India Dress Code | నవరాత్రి ఉత్సవాల డ్రెస్‌కోడ్‌పై నిరసన వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కు తగ్గింది. ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీసు డిజిటలైజేషన్ జనరల్ మేనేజర్ ఏఆర్ రాఘవేంద్ర ఈ డ్రెస్‌కోడ్ జారీ చేశారు. ఈ నెల 7-15 తేదీల్లో ఉద్యోగులు సదరు డ్రెస్ కోడ్ పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే రూ.200 వరకు ఫైన్ విధిస్తామని పేర్కొనడం గమనార్హం.
ఈ నెల ఒకటో తేదీన జారీ చేసిన ఈ సర్క్యులర్‌లో ప్రతి రోజూ ఉద్యోగులంతా గ్రూప్ ఫొటో దిగాలని కూడా పేర్కొన్నారు. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్, రాయల్ బ్లూ, పింక్, పర్పుల్, గ్రే, రెడ్ కలర్స్‌లో డ్రెస్‌లు ధరించాలని ఆ సర్క్యులర్‌లో తెలిపారు. చీక్ షర్ట్స్, బేస్ కలర్ డ్రెస్‌లు కూడా వాడొచ్చునన్నారు.
దీనిపై ఎంప్లాయిస్ ఫెడరేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒక పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి అధికారిక ఆదేశాలు జారీ చేయడం సరి కాదని పేర్కొంది. డ్రెస్ కోడ్ ఖరారు చేసి, పాటించకపోతే పెనాల్టీ విధించడం డిజిటైజేషన్ డిపార్ట్మెంట్ రోజువారీ అధికారిక కార్యక్రమం కాదని స్పష్టం చేసింది. ఇది లౌకిక విధాన స్ఫూర్తికి భిన్నం అని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేయడంతో బ్యాంకు సదరు సర్క్యులర్‌ను విత్ డ్రా చేసుకుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

