న్యూఢిల్లీ, జూలై 15: వీడియోగేమ్ మేకర్ యాక్టివిజన్ బిజార్డ్ను అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 68.7 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడానికి మార్గం సుగమమయ్యింది. అయితే ఈ టేకోవర్ మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యానికి దారితీస్తుందంటూ యూఎస్ రెగ్యులేటర్లు లావాదేవీకి బ్రేక్ వేశారు. తాజాగా రెగ్యులేటర్ల వాదనను యూఎస్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. కాల్ ఆన్ డ్యూటీ వంటి బహుళ ప్రాచుర్యం పొందిన వీడియోగేమ్స్ను రూపొందించిన యాక్టివిజన్ బిజార్డ్..మైక్రోసాఫ్ట్ గూటికి చేరనుంది. 18 నెలల క్రితం ఖరారైన ఈ డీల్ మంగళవారంనాటికల్లా పూర్తికాకపోతే యాక్టివిజన్కు మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల టెర్మినేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.