సంస్థాగత బీమాతో లాభాలెన్నో..

ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మొదటి రోజు నుంచే వర్తిస్తుంది. అయితే దాని ప్రయోజనాలు తక్షణమే పొందాలంటే మాత్రం కొన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను నింపాల్సి ఉంటుంది. అలా చేయకపోతే క్లయిమ్ పెద్ద సమస్య అవుతుంది. ప్రతి పాలసీ తరహాలోనే కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పాలసీలో కూడా నియమనిబంధనలు, షరతులూ ఉంటాయి. వాటిని మొదట చదివి అర్థం చేసుకోండి.
కుటుంబ ప్రొఫైల్ అప్డేట్
కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత మీకు కంపెనీ ఐడెంటిటీ కార్డు వచ్చిన వెంటనే మీ కుటుంబ సభ్యుల వివరాలనూ కంపెనీ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో అప్డేట్ చేయండి. ఇలా చేయకపోతే మీతోపాటు కుటుంబ సభ్యులూ ఇన్సూరెన్స్ క్లయిమ్‌ను పొందలేరు. హెచ్ఆర్ మీద ఆధారపడకుండా మీరే మీ కుటుంబ వివరాలను అప్డేట్ చేయడం మీ బాధ్యత.
ఈ-కార్డ్
ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేసిన వెంటనే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) కార్డులు మీకు మీ కుటుంబ సభ్యుల పేరు మీద జారీ అవుతాయి. అయితే ఈ టీపీఏ కార్డు లేనప్పుడు ఎలక్ట్రానిక్ కార్డు (ఈ-కార్డ్)ను, ఐడీ కార్డును చూపి దవాఖానలో చేరి క్యాష్‌లెస్ సదుపాయాన్ని పొందవచ్చు.
ప్రయోజనాలేమిటో తెలుసుకోండి
క్లయిమ్ సందర్భంగా తిరస్కరణ లేదా మరే ఇతర ఇబ్బందులు ఉండకూడదంటే మొదట హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవండి. అందులో ఏయే జబ్బులకు కవరేజీ ఉంది?.. లేదు?.. పరిశీలించండి. కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్ని షరతులతో కూడి ఉంటుంది.
చివరగా..
కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ విలువ స్వల్పమే. ఉద్యోగం పోతే ఆ మరుక్షణం పాలసీ రద్దయిపోతుంది. కాబట్టి పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవడం తప్పనిసరి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

