Aadhar with Pan Card | ఆధార్‌తో పాన్‌కార్డ్ లింకింగ్‌లో సమస్యలు..!
Aadhar with PAN Card | ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధించడంలో ప్రధాన సమస్యగా మారుతున్నదని పులువురు చెబుతున్నారు.
Aadhar with PAN Card | గత నెల 24 వరకు ఆధార్ నంబర్‌తో 43.30 కోట్లమందికిపైగా తమ పాన్ కార్డ్ నంబర్లను అనుసంధానం చేశారని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌదరి లోక్‌సభలో చెప్పారు. 43,34,75,209 పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయన్నారు. వచ్చేనెల 31 లోగా ఆధార్-పాన్ కార్డులు అనుసంధానించాలి. కానీ ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానిచండంలో పలువురు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డుతో లింకింగ్‌కు మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ సరిపోలకపోతే ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం జరుగడం లేదు.
ఆధార్ కార్డ్ వివరాలు సరిగ్గా లేకుండా.. సంబంధిత అధారిటీ నుంచి ఆధార్ డిటైల్స్ సరి చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ (ఆధార్ సేవా కేంద్ర)కు వెళ్లాలి.
యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా అడ్రస్ మార్పు ఎలాగంటే?:
- 1. uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. ‘మా ఆధార్’టాబ్ కిందకెళ్లి ‘అప్డేట్ డెమొగ్రాఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్’ క్లిక్ చేయాలి.
3. మీరు మళ్లీ https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌కెళ్లి లాగిన్ కావాల్సి ఉంటుంది.
4. ఆధార్ నంబర్‌తోపాటు కాప్ట్చా (captcha) కోడ్ టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ 10 నిమిషాలు మాత్రమే వాలిడ్ అవుతుంది. కనుక ఓటీపీ టైప్ చేసి లాగిన్ కావాలి.
5. ఇప్పుడు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి.
6. న్యూ వెబ్‌పేజీలో అప్డేట్ సమాచారానికి సంబంధించిన సూచనలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంటుంది.
7. మీకు అవసరమైన డేటాను ఎంపిక చేసుకుని అప్డేట్ చేయాలి. నూతన అడ్రస్‌ను అప్డేట్ చేసిన తర్వాత ప్రీవ్యూ బటన్ నొక్కితే ఆధార్ కార్డులో నూతన అడ్రస్ వివరాలు ఉన్నాయా? లేదా తెలుస్తుంది.
8. డేటా చెక్ చేసుకున్నాక.. అప్డేట్ చేయాల్సిన సమాచారం ఇంగ్లిష్, తెలుగు లేదా స్థానిక భాషలో టైప్ చేయాల్సి ఉంటుంది. అప్డేటెడ్ వివరాలు సరిగ్గానే ఉంటే క్లిక్ చేసి పేమెంట్ పోర్టల్ రీ డైరెక్ట్ చేయాలి. అప్డేటెడ్ ప్రక్రియ చేపట్టడానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
సదరు వ్యక్తి ఆధార్ కార్డు, అది ఎవరి పేరుమీదుంది, సెక్స్, డేటాఫ్‌బర్త్ వివరాలను.. దాంతో రిజిస్టర్ చేసిన మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వసతుంది. ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, పేరు, అడ్రస్, లింగం, డేటాఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి. అప్డేటింగ్ ప్రక్రియలో అవసరమైనప్పుడు ఒన్‌టైం పాస్వర్డ్ ఇవ్వవచ్చు. ఆధార్ అప్డేట్ కేంద్రంలో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, భాష అప్డేట్ చేశాక.. మొబైల్ నంబర్‌కు ఆ వివరాలు వెళతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

