స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఢమాల్!
దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలకు ధరల పెంపు సెగ గట్టిగానే తాకనున్నది. రూపాయి పతనంతో మొబైల్ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచిన సంస్థలకు అమ్మకాల రూపంలో షాక్ తగలబోతున్నది.
- పెరిగిన ధరలతో 30 శాతం వరకు పడిపోయే అవకాశం
న్యూఢిల్లీ, మే 30: దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలకు ధరల పెంపు సెగ గట్టిగానే తాకనున్నది. రూపాయి పతనంతో మొబైల్ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచిన సంస్థలకు అమ్మకాల రూపంలో షాక్ తగలబోతున్నది. వచ్చే పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉన్నదని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ధరలు మరోసారి పెరిగితే వార్షికంగా స్మార్ట్‌ఫోన్ సేల్స్ భారీగా పడిపోనున్నాయని త్రైకిన్ టెక్నాలజీ, టెకేర్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 6 వేల మంది యాక్టివ్ మొబైల్ కొనుగోలుదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 48 మంది వచ్చే ఆరు నెలల్లో ఫోన్ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదావేసుకుంటున్నట్టు చెప్పారు. కానీ, ఆరు శాతం మంది తమ వద్ద ఉన్న ఫోన్‌ను ఎక్సేంజ్ ఇచ్చి ఇతర స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నదన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు భవిష్యత్తులోనూ కొనసాగితే వచ్చే ఆరు నెలల్లో స్మార్ట్ఫోన్ల డిమాండ్ 11-12 కోట్లకు పడిపోనున్నట్టు తెలిపింది. రూ.20 వేల లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ల ధరలు సరాసరిగా 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగాయి. ధరల పెరుగుదలే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని టెకేర్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. గడిచిన ఏడాదికాలంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువు ఐదు శాతం పడిపోయింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఆరు శాతం మంది సెకండ్ హ్యాండ్ మొబైళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

