Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ? పుంజుకున్న పౌండ్
Rishi Sunak | బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖాయం కావడంతో డాలర్‌పై బ్రిటన్ పౌండ్ పుంజుకుని 1.134 వద్ద నిలిచింది.
Rishi Sunak | టోరీ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై బ్రిటన్ పౌండ్ పుంజుకున్నది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌పై 0.4 శాతం లాభ పడి 1.134గా నిలిచింది. రుణ పరపతి వ్యయాలు తగ్గుముఖం పట్టాయి.
బ్రిటన్ ప్రధాని అభ్యర్థిత్వానికి 100 మందికి పైగా అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు సంపాదించిన నేత మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్. రిషికి పోటీగా ఉన్న పెన్నీ మోర్డాంట్ బరిలో నిలవాలంటే 100 మంది ఎంపీల మద్దతు కావాలి. అప్పుడే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నికకు సభ్యుల ఓటు వేయాల్సి ఉంటుంది. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు 102 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రకటించుకున్నా.. కేవలం 57 మంది మాత్రమే బహిరంగంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ ఐక్యత కోసం ప్రధాని అభ్యర్థిత్వం కోసం జరిగే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు జాన్సన్ ప్రకటించారు.
కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్ బరిలో ఉన్నా, 100 మంది ఎంపీల మద్దతు పొందడంలో వెనుకబడి ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోపు 100 మంది సభ్యులు మద్దతు ఉంటేనే పార్టీ సభ్యుల ఓటింగ్ అవసరం అవుతుంది. రాజీనామా చేసిన ప్రధాని లిజ్ ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్‌తో ప్రభుత్వ రుణ వ్యయాలు పెరిగిపోయాయి. డాలర్‌పై పౌండ్ ధర రికార్డు స్థాయిలో పతనమైంది. కొత్త ఆర్థిక మంత్రి జెరెమీ హంట్.. ప్రధాని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీ మేరకు సంపన్నులపై పన్నుల్లో కోత విధించినా మార్కెట్లో పరిస్థితులు కుదుట పడలేదు.
శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో పౌండ్ 1.11 స్థాయికి పడిపోయింది. మరోవైపు రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ప్రభుత్వ రుణ వ్యయాలు పెరిగిపోయాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతపై హెచ్చరికలు జారీ కావడం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. కానీ, ప్రధాని ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు జాన్సన్ ప్రకటించడంతోనే పౌండ్ తిరిగి పుంజుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

