Poco X6 Pro | త్వరలో భారత్ మార్కెట్లో పోకో ఎక్స్6 ప్రో ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Poco X6 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నది.
Poco X6 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నది. గత ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పోకో ఎక్స్5 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా పోకో ఎక్స్6 (Poco X6), పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) ఫోన్లు వస్తున్నాయి.
రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నారని సమాచారం. గత సెప్టెంబర్ లో రెడ్ మీ13 5జీ, రెడ్ మీ నోట్ 13 ప్రో+ ఫోన్లను గత సెప్టెంబర్ లో చైనాలో ఆవిష్కరించారు.
పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తోంది. 200 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, శాంసంగ్ హెచ్పీ3 సెన్సర్, 8 మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది.
67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 6 జీబీ/8జీబీ/12 జీబీ ర్యామ్, 128 జీబీ /256 జీబీ / 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

