Jan-Dhan Accounts | జన్‌ధన్ ఖాతాలెన్ని ఉన్నాయంటే..?!.. వీటివల్ల ఇవీ బెనిఫిట్లు..!
Jan-Dhan Accounts | దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఇప్పటివరకు 50 కోట్ల మందికి పైగా జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
Jan-Dhan Accounts | దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో జన్‌ధన్ బ్యాంకులు 50 కోట్ల మార్క్‌ను దాటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. తొమ్మిదేండ్లలోనే ఈ మార్క్ దాటామని వెల్లడించింది. ఈ ఖాతాలతో లబ్ధి పొందిన వారిలో మహిళలు 56 శాతం ఉన్నారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గల 67 శాతం జన్‌ధన్ ఖాతాల్లో రూ.2.03 లక్షల కోట్లు డిపాజిట్ చేశారని కేంద్రం తెలిపింది. ఋ ఖాతాదారులకు 34 కోట్ల రూపే కార్డులు ఉచితంగా జారీ చేశామని వెల్లడించింది.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఒక్కో అకౌంట్లో సరాసరి రూ.4,076 క్యాష్ ఉందని తెలిపింది. దాదాపు 5.5 కోట్ల అకౌంట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ప్రయోజనాలు పొందుతున్నాయని వివరించింది. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జన్‌ధన్ ఖాతాలను ప్రారంభించారు. తొలి ఏడాదిలో 17.90 కోట్ల మంది ఖాతాలు ప్రారంభించారు. ఈ ఖాతాలకు కనీస నగదు నిల్వ నిబంధన వర్తించదు. వీటిపై రూ.2 లక్షల వరకు బీమా వసతి కల్పిస్తుంది కేంద్రం. రూ.10 వేల వరకూ రూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

