నాగ్‌పూర్, జూలై 3 : అత్యున్నత నాణ్యత కలిగిన వాటర్ ట్యాంకులు, పైపులు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ లిమిటెడ్ తాజాగా మార్కెట్లో సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ ట్యాంకులను తీసుకొచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ వాటర్ ట్యాంక్‌లు నీటి స్వచ్ఛతను కాపాడటమే కాకుండా, ట్యాంక్‌ను శుభ్రం చేసే శ్రమను కూడా గణనీయంగా తగ్గిస్తున్నదని పేర్కొంది.
ప్రస్తుతం ఇంటి పైకప్పుపై ఉండే నీటి ట్యాంక్‌లను శుభ్రం చేయడం ఒక పెద్ద సవాల్‌గా మారిందని, వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ వినూత్న టెక్నాలజీతో సరికొత్త ట్యాంక్‌లను రూపొందించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో వాటర్ ట్యాంకు లోపల మురికి, దుమ్ము, చెత్తాచెదారం, ఇతర మలినాలు పేరుకొని పోయి నీటి నాణ్యతను ప్రభావితం చేయడంతోపాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి నియంత్రణ కోసం ఈ ట్యాంక్‌లను విడుదల చేసినట్టు వెల్లడించాయి. ఈ నూతన ట్యాంక్‌లపై పదేండ్ల వ్యారెంటీ కూడా ఇస్తుండటం విశేషం.