Credit Cards | ఇయర్ ఎండ్ హాలీడే ప్లానింగ్ చేస్తున్నారా.. ట్రావెల్ క్రెడిట్ కార్డులతో ఇవీ ఆఫర్లు..!
Credit Cards | ఇయర్ ఎండ్ హాలీడే ప్లానింగ్ చేసే వారికి, తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి పలు బ్యాంకుల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆకర్షణీయమైన ఆఫర్లు, బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి.
Credit Cards | పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయ్.. ఇయర్ ఎండ్ హాలీడే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. మీరు నిత్యం దేశీయంగా విమాన ప్రయాణం చేస్తున్నారా..? అయితే, విమాన ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు తప్పనిసరిగా ఒక క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవల్సిందే. విమానయాన సంస్థలతో కలిసి బ్యాంకులు జారీ చేసే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో టికెట్ల కొనుగోళ్ల నుంచి వివిధ లావాదేవీలపై బెనిఫిట్లు పొందొచ్చు. ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవచ్చు. కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, ఫ్రీ విమాన టికెట్లు, ట్రావెల్ అనుబంధ కొనుగోళ్లపై డిస్కౌంట్లు.. ఇలా పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.. అవేమిటో ఓ లుక్కేద్దామా..
స్టాండర్డ్ చార్టర్డ్ ఈజీ మై ట్రిప్ క్రెడిట్ కార్డుపై బెనిఫిట్లు ఇలా
స్టాండర్డ్ చార్టర్డ్ ఈజీ మై ట్రిప్ క్రెడిట్ కార్డు (Standard Chartered EaseMyTrip Credit Card) తీసుకున్న వారికి ఈజీ మై ట్రిప్ వెబ్ సైట్I యాప్ ద్వారా హోటల్ బుకింగ్ పై 20 శాతం ఇన్ స్టంట్, విమాన ప్రయాణ టికెట్ బుకింగ్ పై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తు్న్నది. అంతే కాదు.. బస్ టికెట్ బుకింగ్ మీద రూ.125 వరకు రాయితీ పొందొచ్చు. హోటల్, ఎయిర్ లైన్ వైబ్ సైట్లు, యాప్స్, ఔట్ లెట్ల వద్ద విమాన టికెట్ల బుకింగ్ కోసం ప్రతి రూ.100 వినియోగంపై 10X రివార్డు పాయింట్లు పొందొచ్చు. మూడు నెలలకొక సారి దేశీయ విమానాశ్రయ లాంజ్ లోకి ఉచితంగా వెళ్లేందుకు కాంప్లిమెంటరీ పాస్ లభిస్తుంది. ఈ కార్డుపై వార్షిక ఫీజు రూ.350 మాత్రమే.
ఇవీ ఐఆర్సీటీసీ ఎస్బీఐ ప్రీమియర్ బెనిఫిట్లు
ఐఆర్సీటీసీ ఎస్బీఐ ప్రీమియర్ (IRCTC SBI Card Premier) క్రెడిట్ కార్డు రైల్వే టికెట్ బుకింగ్స్ మీద ఒక శాతం, విమాన ప్రయాణ టికెట్ల బుకింగ్స్ మీద 1.8 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఏడాదిలో ఎనిమిది దేశీయ రైల్వే లాంజ్ లోకి ఉచిత ఎంట్రీ ఆఫర్ లభిస్తుంది. ఐఆర్‌సీటీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రైలు ప్రయాణాల్లో ఏసీ కోచ్ లు, చైర్ కార్ టికెట్లు బుక్ చేసుకుంటే రివార్డు రూపంలో 10 శాతం వాల్యూ బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది.
సిటీ ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డుపై రూ. కోటి వరకు ఇన్సూరెన్స్
సిటీ ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డు (Citi Premier Miles Credit Card) కల వారు దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ చేసుకోవచ్చు. పార్టనర్ రెస్టారెంట్లలో డైనింగ్ మీద 20 శాతం బిల్లు ఆదా చేయొచ్చు. ఎయిర్ టికెట్ కొనుగోళ్లపై ప్రతి రూ.100లకు 10 మైల్స్ (రివార్డు పాయింట్లు) లభిస్తాయి. దీనిపై రూ.కోటి వరకు విమాన ప్రమాద బీమా కవరేజీ ఉంది. ఈ కార్డుపై వార్షిక ఫీజు రూ.3000 పే చేయాలి.
యాక్సిస్ విస్తారా కార్డుపై నాలుగు ఎకానమీ టికెట్లు ఫ్రీ
యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు (Axis Vistara Signature) తీసుకున్న వారికి కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ లభిస్తుంది. ఈ కార్డుపై ఖర్చు పరిధిని బట్టి నాలుగు కాంప్లిమెంటరీ ఎకానమీ విమాన టికెట్లు పొందొచ్చు. ప్రతి రూ.200 ఖర్చుపై నాలుగు విస్తారా క్లబ్ పాయింట్లు లభిస్తాయి. ఎంపిక చేసిన దేశీయ విమానాశ్రయ లాంజ్ ల్లోకి 90 రోజులకు రెండు కాంప్లిమెంటరీ పాస్ లు లభిస్తాయి. ఈ కార్డుపై రూ.3000 వార్షిక ఫీజు చెల్లించాలి.
ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుపై బెనిఫిట్లు ఇలా
ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు (Air India SBI Signature Credit Card) కల వారు ఎయిర్ ఇండియా వెబ్ సైట్లు, యాప్ ద్వారా విమాన టికెట్లు కొనుగోలు చేస్తే ప్రతి రూ.300 ఖర్చుపై 30 రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తున్నది. ఎయిర్ ఇండియా ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ప్రోగ్రాం-ఫ్లయింగ్ రిటర్న్స్ కాంప్లిమెంటరీ సభ్యత్వం, కాంప్లిమెంటరీ ప్రియారిటీ పాస్ ప్రోగ్రాంతో 600కి పైగా విమానాశ్రయాల లాంజ్ ల్లోకి ఎంట్రీ ఫ్రీ. దేశీయ విమానాశ్రయాల లాంజ్ల్లోకి ఏటా ఎనిమిది కాంప్లిమెంటరీ విజిట్స్ చేయడానికి అనుమతి ఉంది. ఈ కార్డుపై రూ.4999 వార్షిక ఫీజు చెల్లించాలి.
క్రెడిట్ కార్డు స్మార్ట్‌గా వాడితే ఇవీ బెనిఫిట్లు.. లేదంటే..?
స్మార్ట్‌గా, బాధ్యతాయుతంగా ట్రావెల్ క్రెడిట్ కార్డులు వాడుతూ ఉండాలి. క్రెడిట్ వాడకంలో క్రమశిక్షణ పాటిస్తూ ఉండాలి. క్రెడిట్ కార్డుల వాడకంపై ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ టైంలో కుటుంబంతో కలిసి హాలీ డే ట్రావెలింగ్ పెరుగుతుంది. ఒకవేళ అవసరానికి మించి ఖర్చు చేస్తే సకాలంలో బిల్లు చెల్లించలేని పరిస్థితులు వస్తాయి. దీనివల్ల లేట్ ఫీజుతోపాటు భారీగా 28-49 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

