Credit Cards | క్రెడిట్ కార్డులు.. పర్సనల్ లోన్లకు గిరాకీ.. ఇండ్ల రుణాలపై కాస్త తగ్గిన డిమాండ్
Credit Cards | గతంతో పోలిస్తే వస్తువుల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లకు గిరాకీ పెరిగింది. మరోవైపు ఇండ్ల రుణాలకు డిమాండ్ తగ్గింది.. కానీ హోంలోన్ల అప్రూవల్ రేట్ మాత్రం 41 శాతం నమోదైంది.
Credit Cards | గతంలో క్రెడిట్ కార్డులు.. పర్సనల్ లోన్స్.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఆల్టర్నేటివ్ లేక ఎమర్జెన్సీగా వినియోగించే ఆప్షన్.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆదాయం పెరుగుదలతోపాటు వస్తువుల వాడకం కూడా ఎక్కువైంది. కుటుంబ అవసరాలతోపాటు అభిరుచులు, ఆకాంక్షలకు అనుగుణంగా ఖర్చులు పెరిగాయి. వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లకు గిరాకీ పెరిగిందని ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పర్సనల్ లోన్ల కోసం ఎంక్వయిరీలు 50 శాతం పెరిగితే, క్రెడిట్ కార్డుల కోసం ఆరా తీసిన వారు 77 శాతం పెరిగారు. ఆస్తులపై రుణాలు 29 శాతం పెరిగాయి. ఇండ్ల కొనుగోళ్లు విలువలో రెండు శాతం, పరిమాణంలో ఆరు శాతం తగ్గుముఖం పట్టింది. అయినా, ఇండ్ల రుణాలకు అప్రూవల్స్ మాత్రం శక్తిమంతంగా 41 శాతం నమోదయ్యాయి. ఫిబ్రవరిలో పర్సనల్ లోన్లు 25.8 శాతం పెరిగితే, క్రెడిట్ కార్డు వాడకం 29.2శాతం ఎక్కువైంది. అయితే 2021తో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో కొత్త వర్గాలకు రుణాల అప్రూవల్ రేటు 24 శాతానికి పడిపోయింది.
18 నుంచి 30 ఏండ్ల లోపు కుర్రాళ్లు 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 43 శాతం మంది రుణాలు, క్రెడిట్ కార్డులతో బెనిఫిట్లు, ఫీజుల గురించి ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి గురించి ఎంక్వయిరీ చేసే వారు 21 శాతం నుంచి 22 శాతం మంది పెరిగారు. డిసెంబర్ త్రైమాసికంలో టూ వీలర్ రుణాల పరిమాణం, విలువలోనూ గ్రోత్ రికార్డయింది. పరిమాణంలో 23 శాతం, విలువలో 40 శాతం టూ వీలర్ రుణాలు పెరిగాయి.
వడ్డీరేట్లు పెరిగిన నేపథ్యంలో 2022-23 డిసెంబర్ త్రైమాసికంలో ఇండ్ల రుణాల గిరాకీ కూడా ఒకశాతం తగ్గిందని ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఇండ్ల రుణాలకు 2021-22 డిసెంబర్ త్రైమాసికంలో ఏడు శాతం డిమాండ్ ఉంటే.. గత డిసెంబర్ త్రైమాసికంలో ఆరు శాతానికే పరిమితమైంది. అధిక ద్రవ్యోల్బణంతోపాటు వడ్డీరేట్లు పెరిగిపోవడంతో ఇండ్ల కొనుగోలు దారులు అధిక రుణాల విషయంలో సంప్రదాయ విధానానికే ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

